ధాన్యం కొనుగోలులో  ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం  

ధాన్యం కొనుగోలులో  ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం  
పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.


ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని నల్లగొండ ఎంపీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శనివారం నల్లగొండ మండలం కొత్తపల్లి, జి.చెన్నారం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ
సీఎం కేసీఆర్ మాటలకు, క్షేత్ర స్థాయిలో పరిస్థితికి పొంతనలేదని ధ్వజ మెత్తారు.


ఒక్కో రైతు కనీసం పక్షం రోజుల నిరీక్షిస్తే తప్పా కొనుగోళ్లు జరగడం లేదని అన్నారు.


ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి ఒక్క పైసా చెల్లించలేదని విమర్శించారు.


ఆకాలవర్షంతో ధాన్యం తడిస్తే తేమ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


తేమ శాతంతో సంభందం లేకుండా కొనుగోళ్లు జరపాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.


బస్తాలు, పట్టాలు యుద్ధ ప్రాతిపదికన సప్లై చెయ్యాలని అన్నారు.


కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ధ్వజ మెత్తారు.


టెస్టులు చెయ్యకుండా మభ్య పెట్టాలని చూస్తుండడం దుర్మార్గం అని అన్నారు.


 


లాక్ డౌన్ లో పేదలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బాగా కృషి చేస్తోందని చెప్పారు.


ఈ విలేకరుల సమావేశంలో డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ ,నల్గొండ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత వెంకటయ్య, వైస్ ఎంపీపీ జిల్లా జిల్లేపల్లి పరమేష్ ,సర్పంచులు గుండెబోయిన వెంకటయ్య, ఉప్పునూతల వెంకన్న, పనస శంకర్, భిక్షం ,సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి , నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.