విశాఖ గ్యాస్ లీక్ అవుద్దని స్వరూపానందకి తెలుసా?
స్వామి చెప్పిన మే 5 తరువాత విజయసాయిరెడ్డి కూడా విశాఖలో లేడు
విజయసాయిరెడ్డి ట్రస్ట్‌కి విరాళం ఇచ్చిన ఎల్‌జీ పాలీమర్స్
ఆ తరువాత లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఫ్యాక్టరీ తెరవడానికి అనుమతి
విశాఖలో గ్యాస్ లీకవుద్దని జగన్ రెడ్డి అభిమానించే స్వరూపానందకి ముందే తెలుసా? అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలన్నీ అవుననే చెబుతున్నాయి.
కరోనా వ్యాప్తి గురించి సన్నాసి మాట్లాడుతూ కాలసర్పదోషం ప్రపంచాన్ని వెంటాడుతోందని.. గ్రహ పరిస్థితుల కారణంగా కరోనా అదుపు కావడం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏప్రిల్ 24 నుంచి దుష్ట గ్రహాల ప్రభావం తగ్గుముఖం పడుతుందని.. మే 5 తర్వాత ఇది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. స్వరూపానంద చెప్పినట్టు మే5 వెళ్లిపోయింది. ఆయన చెప్పినట్టు కరోనా వెళ్లలేదు. జడలు విప్పుకుని కరాళనృత్యం చేస్తోంది.
విశాఖలో గ్యాస్ లీక్...తాడేపల్లిలో విజయసాయి లంచ్ బ్రేక్
మరి స్వరూపానంద చెప్పిన మే5 తరువాత అనేది ఏంటి? అంటే గ్యాస్ లీక్ అనే వైపు అన్ని వేళ్లూ చూపిస్తున్నాయి. ఎప్పుడూ విశాఖని గబ్బిలంలా పట్టుకుని వేలాడే విజయసాయిరెడ్డి గ్యాస్ లీక్ ఘటనకు ముందే తాడేపల్లి ఎలా చేరాడు? అనేది ఇప్పుడు మరో మిస్టరీ కోణంలో చర్చ సాగుతోంది. వాస్తవంగా విశాఖలో చాలా చోట్ల వేల ఎకరాల భూములు స్కెచ్ వేసి పెట్టుకున్న విజయసాయిరెడ్డి దీనికనుగుణంగానే రాజధాని తరలింపు ప్రకటన తానే చేసేశాడు. స్వరూపా కొన్ని భూములు చూపిస్తే, ఓ అధికారి మరికొన్ని భూముల్ని చూపించాడు. ఈ మొత్తం భూముల్ని క్రమపద్ధతిలో కైంకర్యం చేసేందుకు ఒక్కో మెట్టూ ఎక్కుకుంటూ అడ్డొచ్చినవారిని తొక్కుకుంటూ వస్తున్నారు. మాన్సాస్ భూములు కొట్టేయాలంటే అశోక్‌గజపతిరాజు అడ్డు..అందుకే సంచయిత గజపతిరాజును నిబంధనలకు విరుద్ధంగా మాన్సాస్ బైలాని తొక్కి మరీ నియమించుకున్నారు. ఒక వ్యక్తికి సంబంధించి 200 కోట్ల విలువైన భూమి సెటిల్ మెంట్ కింద అడిగారు. ఇవ్వకపోయేసరికి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చేశారు. ఇలా భూములను రకరకాల మార్గాలలో ఆక్రమించుకుంటూ ఇదిగో వెంకటాపురం వైపు వచ్చారు.
పాలీమార్స్ ఏరియాలో భూముల కోసమేనా?
విశాఖలో ఒక్కో ప్రాంతం భూములు లాక్కుంటూ ఎల్‌జీ పాలీమార్స్ ఏరియా వచ్చారు. ఇక్కడ ఆక్రమించుకుని ఉంటున్నవారు, ప్రభుత్వ భూముల్లో వున్నవారిని ఖాళీ చేయించే ప్లాన్ వేశారు. విజయసాయిరెడ్డియే ప్రభుత్వం..ప్రభుత్వమే విజయసాయిరెడ్డి.. స్థలాలు, ఇల్లు, భూములు ఖాళీ చేయాలని నోటీసులు వెళ్లాయి. వాళ్లు ఖాళీ చేయలేదు. ఇది చాలా రోజులుగా నలుగుతోంది. ఇక బాబాయ్ బాత్రూమ్ గుండెపోటు స్కెచ్‌లాంటిదే వేశారు. అయితే దీనికి తమ తైనాతీ సిద్ధాంతి స్వరూపాతో పలుకులు పలికించారు. మే 5 తరువాత అంతా మంచే జరుగుతుందని. ఇది వెంకటాపురం వాసులు అర్థం చేసుకోలేకపోయారు. పాలీమార్స్ యాజమాన్యం అర్థం చేసుకుంది. విజయసాయిరెడ్డి విశాఖ నుంచి బిచాణా ఎత్తేసి తాడేపల్లి కొంపలో కూర్చున్నాడు. గ్యాస్ లీకైంది. పశువులు, మనుషులు పిట్టల్లా రాలిపోయారు. ఇప్పుడు ఈ ఏరియాని విజయసాయిరెడ్డి ఖాళీ చేయమనక్కర్లేదు. వాళ్లే ఖాళీ చేసి వెళ్లిపోతారు.
ప్లాస్టిక్ తయారీ నిత్యావసరం చేసిన విజయసాయిరెడ్డి
లాక్ డౌన్ మొదటి దశ పూర్తయిన వెంటనే ఎల్‌జీ పాలీమార్స్ కి ఉత్పత్తి ప్రారంభించుకోవచ్చనే అనుమతి లభించింది. ఇదెలాగో తెలుసా! ప్లాస్టిక్ తయారు చేసే ఈ పరిశ్రమ నిత్యావసరాలు తయారు చేస్తోందని తప్పుడు సమాచారం ఇచ్చి మరీ అనుమతి ఇచ్చారు. కాదు కాదు విజయసాయిరెడ్డే ఇప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే విజయసాయిరెడ్డి ఒత్తిడితోనే ఏపీసీసీబీ అధికారులు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ ఉత్తర్వులు ఇచ్చేశారు.
విజయసాయిరెడ్డికి భారీ విరాళం
ముఖ్య మంత్రి కావాలనే లక్ష్యంతో వైఎస్సార్‌సీపీని వీఎస్సార్‌సీపీగా మార్చే పనిలో వున్న విజయసాయిరెడ్డి.. విశాఖ కేంద్రంగా వైఎస్, జగన్ బొమ్మల్లేకుండా, పార్టీ జెండా లేకుండా ప్రగతి భారత్ అనే ట్రస్టును ప్రారంభించాడు. కరోనా కట్టడి కోసం విరాళాలు ప్రభుత్వానికి కాకుండా ఈ ట్రస్టుకే జమ చేయాలని అధికారులు కూడా ఆదేశాలిచ్చారు. మొత్తం పరిశ్రమలకు కోటి నుంచి 10 కోట్ల వరకూ విరాళాలివ్వాలని టార్గెట్‌లు కూడా పెట్టేశారు. విజయసాయిరెడ్డి ఈ కరోనా కాలంలో దాదాపు 200 కోట్లకు పైగానే తన ట్రస్టు పేరుతో విరాళాలు దండారని విశాఖలోని పరిశ్రమల వర్గాల నుంచి సమాచారం. ఎల్‌జీ పాలీమార్స్ 10 కోట్లు సమర్పించుకుందని తెలుస్తోంది. అప్పుడే ప్లాస్టిక్ తయారుచేసే పరిశ్రమకు నిత్యావసరాలు తయారీ పరిశ్రమగా లాక్డౌన్ నిబందనలు ఉల్లంఘించి మరీ అనుమతిప్పించారు విజయసాయిరెడ్డి.
పాలీమార్స్ మన హైలీ రెస్పెక్టెడ్ వారిదేనట!
కొరియా కంపెనీ అయిన ఎల్‌జీ పాలీమార్స్ చేతులు మారుతూ వచ్చింది. అయితే ఈ క్రమంలో పేరులో కూడా మార్పులు జరిగాయి. కొరియా దేశానికి చెందిన ఈ కంపెనీకి రవీంద్రనాథ్‌రెడ్డి సూరుకంటి కంపెనీ సెక్రటరీగా వున్నారు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే! ఆంధ్రప్రదేశ్‌లో నందిని పాలీమర్స్ (ప్రతిష్టాత్మక స్పై హెచ్‌డీ విస్కీ ఉత్పత్తిదారులు) భారతీ పాలిమర్స్ (ప్రభుత్వ పెద్దలది)కి ఎల్‌జీ పాలీమర్స్ మాస్టర్ సప్లయర్ అని తెలుస్తోంది. మొత్తానికి కొరియా కంపెనీ అయినా హైలీ రెస్పెక్టెడ్ చేత, కోసం నడుపుతున్నది అని అర్థం అవుతోంది.
భోపాల్ గ్యాస్ స్థాయి ప్రమాదమైనా ఎల్జీపై పికెట్ పాకెట్ కేసులు
పది మంది చనిపోయారు అధికారికంగా..పరిస్థితి విషమంగా వుంది లెక్కలేనంత మంది. అయితే విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై పిక్ పాకెట్ కేసులు పెట్టడంతోనే దీని కథ ఏంటో అర్థం అవుతూనే వుంది. ఎల్జీ పాలిమర్స్ పై ఐపీసీ సెక్షన్లు 278, 284, 285, 337, 338, 304 కింద గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. విష వాయువులతో వాతావరణాన్ని కలుషితం చేయడం, మానవ జీవనానికి హాని కలిగించడం, నిర్లక్ష్యం, పరిస్థితిని అదుపు చేయకపోవడం, హత్యాయత్నం అనేవి ఈ సెక్షన్లు చెబుతున్నాయి. భోపాల్ గ్యాస్ ప్రమాదం స్థాయిలో ఎల్జీ ప్రమాదం ఉన్నా..సెక్షన్ల నమోదులో కానీ, సర్కారు స్పందనలో కానీ ఆ తీవ్రత కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు బాధితుల్ని పరామర్శించేందుకు వచ్చిన సీఎం జగన్‌రెడ్డి విమానాశ్రయంలోనే ఎల్జీ యాజమాన్యంతో నవ్వుతూ మంతనాలు సాగించడం, కోటి రూపాయలు వెలకట్టి ..పెయిడ్ మీడియాతో శెహభాష్ అనే కీర్తనలు అందుకోవడం, ఎల్జీ కంపెనీ తప్పేమీ లేదని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పిలుపునివ్వడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.