తమను స్వస్థలాలకు పంపడంలేదంటూ వలస కార్మికులు తిరుగుబావుటా ఎగువవేశారు. కృష్ణా జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్, నెల్లూరు జిల్లా షార్‌లో శుక్రవారం కార్మికుల ఆందోళనతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి వారిని నిలువరించారు. వివరాలివీ.. లాక్‌డౌన్‌తో మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణ పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన సుమారు మూడు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌తో పనులు నిలిచిపోవడంతో తమను స్వస్థలాలకు పంపించాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై కాంట్రాక్టు సంస్థలతో అనేక మార్లు గొడవలు జరగ్గా, ఇటీవల గుంటూరు ఐజీ ప్రభాకరరావు మూడు రోజుల్లో స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లుచేస్తామని హామీ ఇచ్చారు.మూడు రోజులు పూర్తయినా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో కార్మికులు శుక్రవారం మరోమారు ఆందోళనకు దిగారు. మూకుమ్మడిగా బంగ్లా వద్ద గల రైల్వే ఓవర్ బ్రిడ్జిపైకి చేరుకున్నారు.
స్వస్థలాలకు పంపడంలేదంటూ వలస కార్మికులు