తెలంగాణ నుండి ఆంధ్ర లోకి నది ద్వారా నాటు పడవ లో

గుంటూరు రూరల్ పోలీస్


తెలంగాణ నుండి ఆంధ్ర లోకి నది ద్వారా నాటు పడవ లో ప్రవేశించుటకు ప్రయత్నించిన వారిని అదుపు లోకి తీసుకున్న *గురాజల రూరల్ సిఐ ఉమేష్*


తెలంగాణ రాష్ట్రం లోని వాడవల్లి గ్రామము నుండి కృష్ణ నది ద్వారా ఆంధ్ర రాష్ట్రం పొందుగల లోకి ప్రవేశించుటకు ప్రయత్నం.


గురజాల సిఐ కి రాబడిన   విశ్వసనీయ సమాచారం సమాచారం మేరకు స్వయంగా నది వద్దకు వెళ్లి పడవలో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలకు ప్రమాదం కలగకుండా వారిని అదుపులోకి తీసుకొని, 7 పడవలు సీజ్ చేసి, పడవ నడిపిన వారి పై కేసు నమోదు చేసినారు.


ఒక పడవ లో ప్రయాణిస్తున్న ఇద్దరిని క్వారంటైన్ కి తరలింపు.


ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతము లో చోటు చేసుకున్న ఘటన.


పోలీసులు రాత్రింపగళ్ళు నిద్రాహారాలు మాని కష్టపడి విధులు నిర్వర్తిస్తున్నారనడానికి ఈ చిన్న సంఘటన నిదర్శనం.


నది పరివాహక ప్రాంతము లో కూడా అది చీకటి లో సమర్ధవంతముగా విధులు నిర్వర్తించిన సిఐ మరియు సిబ్బందిని అభినందించిన *గుంటూరు రూరల్ ఎస్పీ శ్రీ సీహెచ్.విజయరావు ఐపిఎస్* గారు.


చట్ట విరుద్ధంగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంగిస్తూ ప్రజలను ఒక ప్రాంతము నుండి ఇంకో ప్రాంతమునకు చేరవేయుటకు ప్రయత్నించిన వారివాహనములు సీజ్ చేసి, వారి పై కేసు కట్టడం జరుగుతుందని ఈ సందర్భముగా ఎస్పీ గారు తెలిపారు.