అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఎస్ఎఫ్ఐ సిఐటియు నాయకులు.
స్వతంత్ర సమరయోధుడు, మన్యం దొర అల్లూరి సీతారామరాజు వర్ధంతి ని పురస్కరించుకుని ఈ రోజు కార్యాలయంలో సుందరయ్య కార్యాలయంలో అల్లూరి సీతారామరాజుచిత్రపటానికి పూలమాల వేసి నివాలర్పించారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి గోపీనాయక్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి అని ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం అని సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి పేద ప్రజలను దాస్య శృంఖలాల నుండి విడిపించడం కోసం తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 సంవత్సరాల వయసులోనే బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఎదురొడ్డి తలపడిన పోరాటయోధుడు.
మన్యం ప్రజలను బ్రిటిష్ తెల్లదొరలు చేతి నుండి విడిపించి వారి బానిసత్వం సంకెళ్లను విడిపించాలని పోరాటం చేసి 1924 మే 7వ తేదీన కొయ్యూరు గ్రామ సమీపంలో బ్రిటిష్ వారి తూటాల ధాటికి బలయ్యాడు.
ఆయన చేసిన పోరాట స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకొని సమాజ అభ్యున్నతికి పాటుపడాలి అని కోరారు*
ఈ కార్యక్రమంలో సి ఐ టి యు మండల కార్యదర్శి గోపాల్ యుటిఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు మహేశ్వర వెంకటేశ్వరావు హన్ను జక్కుల రవి తదితరులు పాల్గొన్నారు