రాష్ట్రంలో వున్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం *5000 వేలు* ఆర్థిక సహాయం చేసి *అన్న క్యాంటిన్లు* వెంటనే తెరవాలి . ఎమ్మెల్సీ *యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్*
*ఈ రోజు పెనమలూరు నియోజకవర్గం ఉయ్యురు రూరల్ మండలం గండిగుంటగ్రామంలో* దండమూడి చౌదరి, పూజితల స్వగృహంనందు ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా చేపట్టిన 12 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా సంఘిభావం తెలిపిన ఎమ్మెల్సీ *రాజేంద్ర ప్రసాద్*
ఈ సందర్భంగా *రాజేంద్ర ప్రసాద్* గారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ వలన పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నారని, ఏదో మొక్కుబడి కింద కొంచం పప్పు, బియ్యం, 1000 రూపాయలు ఇచ్చి నెల అంతా గడుపుకోమంటే సరిపోతుందా అని, మీ కుటుంబాలకేమో నెలకు లక్షల్లో ఖర్చు పేదలకు 1000 రూ,, ఎలా సరిపోతాయని ఈ సందర్భంగా సూటిగా ముఖ్యమంత్రి గారిని, మంత్రులను, ఏమ్మెల్యేలను అడుగుతున్నానని *రాజేంద్ర ప్రసాద్* గారు అన్నారు. అంతే గాక ప్రభుత్వానికి లిక్కర్ షాపుల ఆదాయం మీద వున్న ప్రేమ పేదవాడి బ్రతుకుల మీద కనబడటం లేదని, పేదలకు మీరు చెయ్యాలసిన ఆర్థిక సేవా కార్యక్రమాలు మేము చేస్తే నా మీద కేసులు పెడతారా అని, అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిన్నివ్వదూ అనే సామెత గుర్తుచేస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టిన పేదల విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని *రాజేంద్ర ప్రసాద్* గారు అన్నారు.
అంతే గాక మా డిమాండ్స్ అయినటువంటి
1) ప్రతి పేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 5000 వేలు ఆర్థిక సహాయం చెయ్యాలి.
2) పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటిన్ లు వెంటనే తెరవాలి. 3) ఆర్థికంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని గిట్టుబాటు ధర ప్రకటించాలి.
4) చంద్రన్న భీమా పథకాన్ని ప్రారంభించాలి.
5) కొరోనా వలన ప్రజలకు సేవ చేస్తున్న డాక్టర్స్, పోలీస్, పరిశుద్ధ కార్మికులకు సేఫ్టీ కిట్స్ అందించాలి.
అని *రాజేంద్ర ప్రసాద్* గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు
ఈ కార్యక్రమంలో మండవ జయ దేవ్, సయ్యద్ అజ్మతుల్లా, రాజులపాటి ఫణి, నడిమింటి అనిల్, చలపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు