విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కు రూ.50 కోట్ల చెక్ అందించిన ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రతినిధులు

విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కు రూ.50 కోట్ల చెక్ అందించిన ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రతినిధులు



ఇటీవలే విశాఖలో గ్యాస్ లీక్ ఘటన
12 మంది మృతి
నగదు డిపాజిట్ చేయాలని ఎల్జీ సంస్థను ఆదేశించిన ఎన్ జీటీ
విశాఖపట్నం : విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టిరీన్ విషవాయువు లీక్ కావడంతో 12 మంది మృతి చెందగా, వందల మంది ఆసుపత్రుల పాలవడం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్ జీటీ) కూడా స్పందించింది. ముందుగా, రూ.50 కోట్లు జిల్లా కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలంటూ ఎల్జీ పాలిమర్స్ సంస్థ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో సంస్థ ప్రతినిధులు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కు రూ.50 కోట్ల చెక్ అందించారు. దీనిపై కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ, ఎన్ జీటీ ఆదేశాల మేరకు ఆ నిధిని వినియోగిస్తామని చెప్పారు.