మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం (3 May World Press Freedom Day)
పత్రికారంగంలో శ్రమిస్తున్న మిత్రులందరికీ శుభాకాంక్షలు
ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవాన్ని మే 3 వ తేదీన యునెస్కో నిర్వహిస్తుంది. ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశపు విండ హాక్ నగరంలో 1991 ఏప్రిల్ 29 నుండి మే 3 వ తేదీవరకు యునెస్కో నిర్వహించిన సమావేశంలో పత్రికా స్వేచ్ఛకు సంబంధించి పలు తీర్మానాలు చేశారు. స్వేచ్ఛాయుతమైన, స్వాతంత్ర్యమైన, ప్రపంచవ్యాప్తంగా బహుళ జాతుల సమన్వయానికి మాధ్యమంగా, ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి, ఆర్ధీకాభివృధ్ధికీ, పౌరుల ప్రాధమిక హక్కుయైన పత్రికా స్వేచ్చ పరిఢవిళ్లడం అవసరం. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ప్రపంచ పత్రికా దినోత్సవాన్నిడిసెంబర్ 1993లో ప్రకటించింది
ఐక్య రాజ్య సమితి 19వ ఆర్టికల్ లోనే పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన మూలాలు ఇమిడి ఉన్నాయి “భావ స్వేచ్చ, ప్రకటన, స్వేచ్ఛగా అభిప్రాయాలను కల్గియుండటం ప్రపంచంలోని ప్రతీ పౌరుని ప్రాధమిక హక్కు. ఈ హక్కుల ఇతరుల దయా దాక్షిణ్యాలతో వచ్చినవి కావు, జన్మతో స్వతఃసిధ్ధంగా సంక్రమించినవి. (మన రాజ్యాంగంలో కూడా ప్రాధమిక హక్కులను చర్చించింది 19అధికరణంలోనే)
రాజకీయాలలోనూ, పరిపాలనలోనూ స్వచ్ఛత విలసిల్లడానికీ, పరుగెత్తేకాలంతో సమాంతరంగా ప్రజల ముంగిటికి వార్తలు అందించే విలేకరులు ప్రతీ దినం ఎన్నో దాడులను, బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. కొందరు జైళ్ల పాలవుతున్నారు, మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొందరి వివరాలు తెల్యకుండా పోతున్నాయి.
పత్రికాస్వేచ్చా హరణంలో ఇరాక్ ప్రధమ స్థానాన్ని సంపాదిస్తే భారతదేశం 8వ స్థానంలో ఉంది.
పత్రికా స్వేచ్చ ప్రతీ సమాజానికి, వ్యక్తి జీవనానికి అత్యంత కీలకమైనది. ఆ దేశంలోకానీ, సమాజంలోకానీ పత్రికా స్వేచ్ఛను నియంత్రించడమంటే ఆ సమాజాన్ని అంధకారంలోకి నెట్టివేయడమే. పత్రికా స్వేచ్చా పారదర్శకతను తద్వారా సుపరిపాలనను పెంపొందిస్తుంది. పత్రీకా స్వేచ్చ అవగాహన, విజ్ఞానాలను అనుసంధానం చేసే వారధి వంటిది. జాతులు, సంస్కృతుల మధ్య భావ మార్పిడికి, వాటి అభివృధ్ధికి పత్రికలు, పత్రికా స్వేచ్చా తప్పనిసరి.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రమాదపుటంచుల్లో వార్తలు సేకరించే విలేకరులకు (లేదా మరిణించిన విలేకరులకు) యునెస్కో/ గ్యూలెర్మో కనో ప్రపంచ పత్రికా స్వేచ్చా బహుమతిని ప్రదానం చేస్తారు. కొలంబియాకు చెందిన గ్యూలెర్మో కనో అనే విలేకరి డ్రగ్ మాఫియాను ఎండగడుతూ 1986లో తన పత్రికా కార్యాలయం ఎదుటనే హత్యకు గురయ్యాడు.
ప్రజలకోసం, పత్రికా స్వేచ్ఛాకోసం కృషిచేస్తున మన పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ, అసువులు బాసిన సంపాదకులకు, విలేకరులకు ఈ రోజున నివాళులర్పించడం మన కనీస ధర్మం.