జీవో నెంబర్ 15ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది..

*ఆంధ్రప్రదేశ్ (హైకోర్టు) :


ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 15ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది..


★ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ చేసిన సిఫార్సుల మేరకు రాష్ట్రంలో వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


*ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ 23 ఇంజనీరింగ్ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి..*


★ తమ కళాశాల ఫీజు నిర్ణయం సహేతుకంగా లేదని పిటిషన్‌లో యాజమాన్యాలు పేర్కొన్నాయి. 


★ ఈరోజు హైకోర్టులో కళాశాలల యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. 


*ఈ నేపథ్యంలో జీవోను సస్పెండ్ చేస్తూ హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది..