టి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి.
ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ
మేడ్చల్ జిల్లా:-ఘట్కేసర్ :
మేడ్చల్ జిల్లా :-ఘట్కేసర్ మండల పరిధిలోని ఔషపూర్ టి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, లాక్ డౌన్ నేపథ్యంలో తినడానికి తిండి లేక చేయడానికి పని లేక ఇబ్బంది పడుతున్న వలస కూలీలకు ,పేద ప్రజలకు కార్మిక ,ఉపాధి శాఖ మంత్రి చమకూర మల్లరెడ్డి , ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బియ్యం,పప్పు,నూనె, చింతపండు పలు రకాల నిత్యావసర వస్తువులను సామాజిక దూరాన్ని పాటిస్తూ పేద ప్రజలకు అందించడం జరిగింది...
ఈ విపత్కర పరిస్థితులలో పేద ప్రజలను ఆదుకోవడానికి తమకు తోచిన విధంగా మానవతా దృక్పథంతో దాతలు ముందుకు రావాలని కోరారు.
ప్రతి ఒక్కరు సామాజిక దూరాన్ని పాటిస్తూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరి ఇంటి
నుండి బయటకు రావద్దని అందరూ ఐకమత్యంగా ఉండి కరోనా ను తరిమికొడదాం అని ఈసందర్భంగా ఆయన తెలిపారు...ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చెందర్ రెడ్డి ఉప సర్పంచ్ ఐలయ్య , టిఆర్ఎస్ పార్టీ మండల జనరల్ సెక్రెటరీ నాగరాజు టిఆర్ఎస్ పార్టీ మండల్ యూత్ అధ్యక్షుడు బాలు యాదవ్ వార్డు సభ్యులు టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.