వందనం - అభివందనం.

వందనం - అభివందనం.


నిరంతరం ప్రజల బాగు కోసం శ్రమించే మీడియా మిత్రులారా మీకు వదనం, కరోనా ను కాటికి పంపాలని కంకణం కట్టుకున్న పాత్రికేయులారా మీకు అభివందనం...  


 పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి మమ్మల్ని కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికులారా మీకు వందనం, కరోనా భూతాన్ని మా దరికి రాకుండా చేస్తున్న పురపాలకులారా మీకు అభివందనం....


మా ప్రాణాలకోసం మీ ప్రాణాలు పణంగా పెట్టి మమ్మల్ని రక్షిస్తున్న వైద్య నారాయణలారా మీకు వందనం, సమాజ హితం కోసం అహరహం శ్రమిస్తున్న నిజమైన దేవుళ్లారా మీకు అభివందనం... 


మా క్షేమమే మీ ధ్యేయంగా రాత్రి పగలు పహరా కాస్తున్న పోలీసు సోదరులారా మీకు వందనం, మా కుటుంబం బాగు కోసం మీ కుటుంబాల్ని వదిలి మాకు రక్షణనిస్తున్న రక్షకభటులారా మీకు అభివందనం....  


ప్రజా క్షేమమే తమ కర్తవ్యంగా, ఆపత్కాలంలో జనం కోసం పనిచేసే వారే నిజమైన నాయకులని నిరూపిస్తున్న మన ప్రభుత్వాధినేతలకు వందనం అభివందనం.
అన్నిరాజకీయపక్షాలకు. స్వచ్ఛంద సంస్థలవారికి అభినందనలు.