చిలకలూరిపేట శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత విద్యార్థులు కు కరోనా నేపద్యంలో ఎండిఎం నిబంధనల కు విరుద్ధంగా బియ్యం,గుడ్లు పంపిణీ వ్యవహారం పై విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. గుంటూరు స్కూల్ ఎడ్యుకేషన్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు రవీంద్రనాధ్ రెడ్డి కి విచారణ జరిపించాలని ఆదేశాలు జారీచేసింది. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఇంటివద్దకు రేషన్ రాష్ట్రవ్యాప్తంగా అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖను రాసారు.విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరించడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తూతూమంత్రంగా దర్యాప్తు చేస్తే నివేదికను తెప్పించుకుని హైకోర్టు లో వేస్తామని తెలిపారు.
బియ్యం,గుడ్లు పంపిణీ వ్యవహారం పై విద్యాశాఖ విచారణ.