నరసరావుపేట లో కరోనా పోసిటీవ్ కేసులు 78, మిగతా చోట్ల 30 మొత్తం 108 కి పెరిగిన క్రమం లో స్వయంగా రంగం లోకి దిగిన గుంటూరు రూరల్ ఎస్పీ.
ఈ రోజు అనగా ది.27.04.2020 న గుంటూరు రూరల్ ఎస్పీ శ్రీ సిహెచ్. విజయరావు ఐ పి ఎస్ గారు నరసరావుపేటలో కరోనా వైరస్ పోసిటివ్ కేసులు పెరుగుతున్నందున స్వయంగా రంగం లోకి దిగి కరోనా వైరస్ ను అరికట్టుటకు ఇద్దరు అదనపు ఎస్పీ ల ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలతో నరసరావుపేట డిఎస్పీ గారి ఆఫీసులో సమావేశం అయి, తదుపరి నరసరావుపేటలో కాలినడకన పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించారు.
ఈ సమావేశం లో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను ప్రత్యేకముగా,పరోక్షంగా మరియు ఎవరెవరితో కలసి తిరిగారు, సంబంధిత వ్యక్తుల యొక్క కాల్ డేటా ఆధారంగా ఇతర మార్గాల ద్వారా సంబంధం ఉన్న వారిని గుర్తించి వెంటనే వైరస్ ప్రబలకుండా కట్టడి చేయటకు అధికారులకు ఎస్పీ గారు దిశా నిర్దేశం చేసినారు.
తదుపరి ఎస్పీ గారు నరసరావుపేటలో 1 టౌన్ మరియు 2 టౌన్ పోలీస్ స్టేషన్లు పరిధిలోని రెడ్ జోన్ ప్రకటించిన వీధులలో కాలి నడకన పర్యటించి లాక్ డౌన్ అమలు మరియు సనిటైజేషన్ విధముగా జరుగుతుందని సమీక్షించారు.
ప్రజలు అనవసరంగా బయట తిరగకుండా పోలీస్ అధికారులకు ఏ విధముగా సహకరిస్తున్నారు అనేది ,ప్రతి ఒక్క వీధిలో జన సంచారం ఏ విధముగా ఉంది, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఎక్కడెక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు అనేది సిసి కెమెరాల మరియు డ్రోన్ కెమెరా ఆధారముగా పరిశీలించారు.
ఇండ్ల బయట గుంపులుగా కూర్చున్న వారిని కోవిడ్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ వారు పంపించివేసినారు.
స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ లు నిరంతరం గస్తీ తిరుగుతూ ఉంటాయని,ప్రజలు ఎవరైనా అనవసరంగా రోడ్ల పైకి, ఇండ్ల నుండి బయటకు వస్తే ఇక పై ఉపేక్షించబోమని, కఠినంగా వ్యవహరిస్తామని తెలుపుతూ అనవసరంగా రోడ్ల పైకి వచ్చిన వారిని 14 రోజులు క్వారంటైన్ సెంటర్ లకు పంపుతామని తెలిపారు.
నరసరావుపేట కంటామినెంట్ ఏరియా లు ఉన్న ప్రదేశాలలో కోవిడ్ నియంత్రణ పోలీస్ టీం లతో కాలి నడకన రోడ్ల పై తిరిగి అచ్చటి పరిస్థితులను పర్యవేక్షించారు.
మీ కుటుంబం ఆరోగ్యంగా కలకాలం బాగుండాలంటే ప్రస్థుత పరిస్థితులలో ఎవరు కూడా బయటకు రావద్దని తెలిపారు.
రెడ్ జోన్ మరియు పరిసర ప్రాంతాలలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకొని పోలీసుల ఆంక్షలు మరింత కఠినతరం చేసినట్లు తెలిపారు.
ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోయిన, కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపించినా వెంటనే మెడికల్ లేక పోలీసు వారిని సంప్రదించి మీ ప్రాణాలను కాపాడుకోవలసినదిగా తెలిపారు.