ఏపీ
ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ సాంకేతికత బృందాన్ని అభినందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్
కరోనా వైరస్ నుండి ప్రజలను కాపాడేందుకు సీఎం వై.యస్.జగన్ సారథ్యంలో పోలీసు శాఖ అన్ని చర్యలను తీసుకొంటోంది-డీజీపీ
వివిధ దేశాల నుండి ఏపీ కి వచ్చిన వారిపై నిఘా కోసం అత్యంత సాంకేతికత పరిజ్ఞానం వినియోగించాము -డీజీపీ
దేశంలోనే మొదటిసారిగా హోం క్వారం టెన్ యాప్ ద్వారా జియో ఫెన్సింగ్ టెక్నాలజీ తో పర్యవేక్షించాము -డీజీపీ
22,478 మంది పై ఇరవై ఎనిమిది రోజులపాటు నిఘా ఏర్పాటు చేశాము-డీజీపీ
జియో ఫెన్సింగ్ టెక్నాలజీ నిబంధనలు ఉల్లంఘించిన 3043 మందిపై కేసులు నమోదు చేశాము-డీజీపీ
*ఇరవై ఎనిమది రోజుల హోం క్వారంటెన్ పూర్తి కావడంతో వారిపైన ఉన్న ప్రత్యేక ఆంక్షలను తొలగిస్తున్నాము -డీజీపీ*
యాప్ ద్వారా అత్యధికంగా తూర్పు గోదావరి, విశాఖ పట్నం జిల్లాలలో ఎక్కువ మందిపై నిఘా పెట్టాం -డీజీపీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు సాధారణ ప్రజలతో కలసి బయట తిరిగేందుకు వెసులుబాటు కల్పిస్తున్నాము -డీజీపీ
*రెడ్ జోన్ ప్రాంతాల వారిపై నిఘాకోసం సాంకేతికత పరిజ్ఞానంతో మరో మొబైలు యాప్ సిద్ధం చేస్తున్నాం -డీజీపీ*
విదేశాల నుండి వచ్చిన వ్యక్తులు పోలీస్ శాఖ కు సహకరించడం వారి దేశ భక్తికి నిదర్శనం -డీజీపీ
కరోనా కట్టడికి సహకరించిన వారికి సర్వదా రుణపడి ఉంటాము -డీజీపీ