ఇది  మనదేశ గొప్పతనం..

ఇండియా జనాభా 130 కోట్లు. 


అమెరికా జనాభా 35కోట్లు..


వైశాల్యం లో మనదేశం కంటే ఎంతో పెద్దది అమెరికా, 


బాగా ధనవంతులు ఉన్న దేశం,


 అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడ చాలా ఎక్కువ,


 ఎంత ఎక్కువంటే అక్కడ ఓ మనిషి నెలరోజులు బతకడానికి పెట్టే ఖర్చుతో,
ఇక్కడ ఐదుగురు ఉండే రెండు కుటుంబాలు బతుకుతాయి,


 విశాలమైన ఇల్లు, ఇంటి ఇంటికి మధ్య దూరం కూడ ఎక్కువ...


బ్రాండెడ్ బట్టలు, లగ్జరీ కార్లు, క్వాలిటీ ప్రీ ఎడ్యూకేషన్,
ఆధునిక సాంకేతిక వ్యవసాయం‌,
వరల్డ్ బెస్ట్ హాస్పిటల్స్,
 ఏ దేశానికి లేనంత రక్షణ వ్యవస్థ, 
ఎయిర్ అంబులెన్సులు,
 చీమ చిటుక్కుమంటే వాలిపోయే పోలీసులు,16ఏళ్ళు దాటితే తల్లి దండ్రులతో సంబంధం లేకుండా బతికే ప్రీడమ్, 
పెళ్ళికి ముందే డేటింగ్ పేరుతో చేసే సహజీవనం, 
అబ్బో ఓకటేమిటిలే అదో భూతల స్వర్గం, 
మాది అగ్రరాజ్యం అని జబ్బలు చరుచుకునే అక్కడి పాలకులు,,,


మరి నేటి పరిస్థితి?
 35కోట్లు ఉన్న జనాభాని కంట్రోల్ చేయలేక, 
రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు,
 మరణించిన వారిని పూడ్చిపెట్టడానికి శ్మశానంలో స్ధలం లేక, 
వాళ్ళని పూడ్చడానికి మనుషులు దొరక్క, పెరుగుతున్న రోగులకి వైద్యం చేయడానికి బెడ్స్ సరిపోక, డాక్టర్లకి కావాల్సిన ఎక్యూప్మెంట్లు దొరక్క, 
శవాలని ఎక్కడ పూడ్చాలో అర్థం కాక,
చివరికి పబ్లిక్ పార్కుల్లో పూడ్చిపెట్టాల్సిన పరిస్థితి,,,


 మరి ఇండియా పరిస్థితి,   ప్రత్యేకంగా చెప్పాల్సిన   పనిలేదు,  కానీ   ఖచ్చితంగా    చెప్పుకోవాల్సింది మాత్రం చాలా ఉంది,


 రాబోయే పరిస్థితిని ముందుగానే అంచనా వేయడం, 


 విదేశాలనుంచి వచ్చే వాళ్ళని రాకుండా ఆపేయడం.


 ఒకరినుండి ఒకరికి   వ్యాపిస్తుంది కాబట్టి‌.  ఒకరినుండి ఇంకొకరికి కనెక్షన్   లేకుండా లాక్ డౌన్ పెట్టడం.


 కాస్త కఠినంగా
 వ్యవహరించైనా, బాధ్యత  లేనోళ్ళని కంట్రోల్లో పెట్టడం,  వ్యాధి సోకిన వారితో పాటు కుటుంబ  సభ్యులకు, చుట్టు పక్కల  వాళ్ళకి పరీక్షలు చేసి, అనుమానం ఉన్న ప్రతి  ఒక్కరిని క్వారంటైన్లో ఉంచడం..


 ఒక్కసారి ఆలోచించండి?


 135 కోట్ల జనాభా ఉన్న ఇండియా లో,


 ఇప్పటికి రోగుల సంఖ్య 4అంకెలు దాటకపోవడం అంటే చిన్న విషయం కాదుగా?


 మరణించిన వాళ్ళు కూడ  2అంకెలు దాటలేదు.


అన్ని సదుపాయాలు అంతంత మాత్రమే ఉన్న మనదేశంలో   ఈ సంఖ్య  చాలా తక్కువే అని నా అభిప్రాయం..


అమెరికా,లండన్ ,ఇటలీ, స్పెయిన్ హలాంటి దేశాలతో పోలిస్తే, 


 మనం ఎన్నో వేల రెట్లు నయం,


 అందుకే ఈరోజు ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా మనవైపు  చూస్తోంది, 


 ఈ వ్యాధి ఇండియాలో వస్తే,


 శవాలగుట్టలు చూస్తాము అని వాగిన నోర్లే, ఈరోజు నోరెళ్ళబెట్టి మనవైపు చూస్తున్నాయి,.


 అంతేకాక ఈరోజు మన మందులకోసం 30దేశాలు క్యూ లో వెయిట్ చేస్తున్నాయి,,,


 ఇది మనకు  మనదేశ గొప్పతనం.