ఏపీకి రూ. కోటి విరాళాన్ని అందజేసిన రెయిన్‌బో హాస్పిటల్స్
గుంటూరు: కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెయిన్‌బో హాస్పిటల్స్ యాజమాన్యం కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించింది. సీఎం జగన్‌మోహన్ రెడ్డికి కోటి రూపాయల చెక్కును సీఎండీ, డాక్టర్ రమేష్ కంచర్ల, వైస్ ప్రెసిడెంట్ సీఎల్‌ఎన్ రెడ్డి అందజేశారు. మరో వైపు కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఏపీలో 133 ప్రాంతాలను ప్రభుత్వం కరోనా రెడ్‌జోన్లుగా ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించింది. ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.