71వ వసంతంలోకి అడుగుపెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
నేడు అపార చాణుక్యుడి జన్మదినం .
1950, ఏప్రిల్ 20న నారావారిపల్లిలో జన్మించిన చంద్రబాబు .
1972లో బీఏ, ఎస్వీ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ .
1978లో కాంగ్రెస్(ఐ) అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా విజయం .
ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ మంత్రి పదవి .
సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు .
28 ఏళ్లకే మంత్రి పదవి చేపట్టిన అరుదైన ఘనత .
1981 సెప్టెంబర్ 10న భువనేశ్వరితో వివాహం .
1983లో చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి ఓటమి .
నాదెండ్ల ఎపిసోడ్ లో చంద్రబాబు చాణక్యం అమోఘం .
1989 ఎన్నికల్లో కుప్పం నుంచి 5 వేల ఓట్ల మెజార్టీతో విజయం .
సెప్టెంబర్ 1, 1995న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు .
ప్రజల వద్దకే పాలన అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం .
1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమం ప్రారంభం .
హైటెక్ సీఎం అంటే ఇప్పటికీ గుర్తొచ్చేది చంద్రబాబే .
1998లో హైదరాబాద్ లో హైటెక్ సిటీ ప్రారంభం .
బై బై బెంగళూర్.. హాయ్ హైదరాబాద్ నినాదం .
1 బిలియన్ డాలర్లకు చేరిన సాప్ట్ వేర్ ఎగుమతులు .
నేటికీ ఐటీ ఉత్పత్తుల్లో హైదరాబాద్ ది ప్రత్యేక స్థానం .
1999 అక్టోబర్ 11న ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు .
29 ఎంపీ సీట్లతో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ .
2004 వరకు ఎన్డీయే కి జాతీయ కన్వీనర్ గా చంద్రబాబు .
2003 అక్టోబర్ లో తిరుమలకు వెళ్తుండగా చంద్రబాబు పై మావోయిస్టుల దాడి .
2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి .
2012లో వస్తున్నా మీ కోసం అంటూ పాదయాత్ర .
2014 ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టిన ప్రజలు .
2014 జాన్ 8న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం .
2019లో టీడీపీ అనూహ్యంగా ఓటమి .
రైతు కుటుంబం నుంచి ప్రపంచ స్థాయి నేతగా ప్రస్థానం .
42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు .
ఎన్నడు వెన్ను చూపలేదు.. వెనుదిరిగి చూడలేదు .
విలువలు, వ్యక్తిత్వమే ఆయుధాలుగా మలుచుకున్నాడు
అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజాసేవకే అంకితం .
నిత్య కృశీవలుడు, తెలుగుజాతి వెలుగురేఖ చంద్రబాబునాయుడు