కొత్తగూడెం డిఎస్పీ పై కేసు నమోదు
కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న తరుణంలో బాధ్యతగా ఉండాల్సిన ఓ పోలీసు అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. విదేశాల నుంచి వచ్చిన తన కుమారుడిని కొత్తగూడెం డీఎస్పీ క్వారైంటన్‌లో పెట్టకుండా తీసుకెళ్లాడు. దీంతో అతనిపై 1897 అంటువ్యాధుల నిర్మూలన చట్టం కింద కేసు నమోదైంది. అయితే, లండన్ నుంచి వచ్చిన డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో కొత్తగూడెం పోలీసు యంత్రాంగంలో కలవరం మొదలైంది. డీఎస్పీతో సహా అతని కుంటుంబాన్ని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు వరంగల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, డీఎస్పీ కుంటుంబం ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో ఓ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిసింది.