*స్వాతంత్ర్య సమరయోధుల సేవలు చిరస్మరణీయం*
*కరోన్ వైరస్ (కోవిడ్ 19) పై ప్రభుత్వం ,మరియు వైద్యుల సూచనలు తప్పనిసరి పాటించాలి*
*సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి*
*మార్చి 23 న స్వాతంత్య్ర సమరయోధులు ప్రఖ్యాత ఉద్యమకారులు శ్రీ భగత్ సింగ్ ,శ్రీ సుఖు దేవ్ థాపర్ ,శ్రీ హరి శివరాంరాజ్ గురు గార్ల వర్థంతి సందర్బంగా*
*మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు*
డోన్ స్థానిక అగ్నిమాపక కేంద్రం నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యం లో
సిఐ వి. వీరారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు అద్యక్షతన మార్చి 23 న స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్ ,రాజ్ గురు సుఖుదేవ్ గార్ల వర్ధంతి సందర్భంగా వారి
చిత్ర పటాలకు పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు వారిని స్మరించుకున్నారు
ఈ కార్యక్రమంలో అగ్నిమాపక కానిస్టేబుల్ సుబ్బయ్య, నాగేశ్వరరావు,మోహన్ రాజ్, గౌరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి , హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు లు మాట్లాడుతూ
శ్రీ భగత్ సింగ్ 1907 సెప్టెంబరు 28 న జన్మించారు. స్వాతంత్ర్య సమర యోధుడు. ప్రఖ్యాత ఉద్యమకారుడు. ప్రజలను చైతన్య పరిచి విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.భారత స్వాతంత్ర్యోద్యమము లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో ఆయన ఒకడు. ఈ కారణంగానే షాహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడ్డారు.ఈయన 1931 మార్చి 23 స్వర్గస్తులైనారు.
సుఖ్ దేవ్ థాపర్ 15 మే 1907 న జన్మించారు
భారత స్వాతంత్ర్య సమర, ఉద్యమకారుడు. ఇతను భగత్ సింగ్ మరియు రాజ్‌గురు ల సహచరునిగా ప్రసిధ్ధి. లాలా లజపతి రాయ్
మరణానికి కారణమైన బ్రిటిష్ ప్రభుత్వం పై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్ లో బ్రిటిష్ పోలీసు అధికారి "జె.పి. సాండర్స్" ను హతమార్చినందుకు గాను మార్చి 23 -1931 న ఉరితీయబడ్డాడు.
హరి శివరాంరాజ్ గురు ఆగష్టు 24, 1908
జన్మించారు.భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడు.
మహారాష్ట్రం లోని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇతను భగత్ సింగ్ మరియు సుఖ్ దేవ్ ల సహచరునిగా ప్రసిధ్ధి. 1928లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్ లో బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి.సాండర్స్ ను హతమార్చినందులకు గాను
ఈ ముగ్గురు విప్లవకారులు భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ దేవ్ లను 1931 మార్చి 23న లాహోరు సెంట్రల్ జైలులో ఉరి తీశారు.
మన దేశం కోసం అతి చిన్న వయస్సు లోనే ప్రాణాలు త్యాగం చేసిన ఈ స్వాతంత్ర్య సమరయోధులను అనుక్షణం స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు. అలాగే సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆరోగ్యం పై అవగాహణ కలిపించారు. ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ,తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ముక్కు,నోటికి చేతిరుమాలు అడ్డం పెట్టుకోవాలని ,నీళ్ళు శరీరాని తగ్గట్టుగా త్రాగాలని, ముఖ్యంగా పిల్లలు జంక్ ఫుడ్ తినరాదని, తగిన సమయం నిద్రపోవాలని, బహిరంగ ప్రదేశాల లో ఉమ్మి వేయకూడదని, జ్వరం వచ్చిందంటే ప్రభుత్వ వైద్యశాల లో వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని తెలిపారు.