లాక్ డౌన్ ధ్వారానే కరోనాను అరికట్టగలం. 

లాక్ డౌన్ ధ్వారానే కరోనాను అరికట్టగలం. 


చైనా వాళ్ళు జనవరి 23 నుంచి ఇంట్లో కూర్చుని lockdown లో ఉంటే నిన్న మొదటి సారి, 60 రోజుల తరువాత, కొత్త cases రాకుండా ఆగాయి. దీనిని బట్టి మనం ఎన్ని రోజులు - ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి బాగా ఆలోచించండి.


మాకు ఏమి కాదులే అని అనుకుంటే పొరపాటే. ఒకసారి india లో పాకింది అంటే, కనీసం 1 కోటి మంది చనిపోతారు.


వెల్లుల్లి, అల్లం, హోమియో, పసుపు ఇవన్నీ వైరస్ ని చంపేసేవి అయితే, ప్రపంచం అంతా ఎప్పుడో అది వాడి దీన్ని కంట్రోల్ చేసేది. దయచేసి You Tube వెధవల మాటలు నమ్మకండి.*


దయచేసి ఇంట్లో ఉండండి. చదువు కోని వాళ్ళకి దీని importance చెప్పండి. కొంత డబ్బు చేతిలో ఉంచుకోండి. ATMలు బాంకుల పరిస్థితి ఏమి టో చెప్పలేము. డబ్బు చాలా చాలా జాగ్రత్త గా వాడండి. తిండికి, మందులకీ తప్పితే అనవసరంగా దేనికి రూపాయి వృథా చేయవద్దు. సింపుల్ గా జీవించండి.*


*ఇటలీలో 1000 మందికి 2.5 బెడ్స్ ఉంటే నే అంత మంది చచ్చి పోయారు. India లో 1000 మందికి 0.5 బెడ్స్ మాత్రమే ఉన్నాయ్ హాస్పిటల్స్ లో. మన హాస్పిటల్స్ లో వసతులు అంతంత మాత్రం.*


*మేము బాగున్నాం, మాకు ఎం కాదు, అని అనుకుంటే పొరపాటే. ఇది గాలి లో నుంచి కూడా వస్తుంది అని ఇవాళే WHO చెప్పింది.*


*ఇది ఆయుర్వేద, హోమియో, యునాని మరి ఏ ఇతరత్రా పద్దతి ద్వారా తగ్గేది కాదు. అలా తగ్గు తుంది అని లేదా రాదు అని ఎవరైనా చెపితే అది కేవలం వాళ్ళు డబ్బులు చేసు కోవడం కోసమే. దయ చేసి డాక్టర్స్కి, నర్సులకి పని పెంచవద్దు.*


*ఎక్కడికి వెళ్లద్దు. మీకు ఎవరి మీద అయిన ప్రేమ ఉంటే, వాళ్ళకి దూరంగా ఉండండి.ముఖ్యంగా, బయట అంతా తిరిగి ఇంట్లో ముసలి వారిని బలి చేయకండి.*


*ఇంటికి రాగానే బట్టలు డెట్టాల్ లో నానబెట్టండి. ఫ్రెష్ గా స్నానం చేసి తరువాత ఇంట్లో మిగతా వారిని కలవండి. బయట నుండి  ఇంట్లోకి వచ్చిన పది నిమిషాల్లో మీ స్నానం అయిపోవాలి.* 


*దయచేసి ఎవరిదో పెళ్లి అనో, చూద్దాం అనో, చాలా రోజులు అయిందనో పోయి కలవ వద్దు.కావాలంటే, ఫోను contact list చూసి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. నీ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క నంబరుకీ ఈ సమాచారం పంపించు. కరోనా గురించి మాట్లాడు. నీకు తెలిసిన సమాచారం వారికి తెలియ జేయండి.*


*ఇండియా వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ, మాకు ఎండలు ఎక్కువ, వైరస్ చస్తుంది. ఇవన్నీ నిజాలు కావు. అది ఏ temperature లో అయిన వ్యాపిస్తుంది.*


*1918 లో ఇలానే ఫ్లూ వస్తే భారతదేశంలో 1 కోటి మంది చచ్చి పోయారు. అప్పుడు, రవాణా సదు పాయాలు, ప్రజల కదలిక ఇంత లేదు. అయినా కూడా అంతా వ్యాపించింది.*


*దయచేసి, మాకు india లో 300 కేసులు మాత్రమే ఉన్నారు. తక్కువ తీవ్రత అని అనుకోకండి. 1 వారంలోనే ఇటలీ, ఇరాన్ లలో 300 నుంచి 6000-7000 వరకు, 2 వారాలు లో 20,000 కు పెరిగి పోయాయి. ఇప్పుడు రోజుకు వందల మంది చని పోతున్నారు.*


*చేతులు శుభ్రంగా సబ్బు తో కడుక్కోండి. కనీసం 20 సెకన్లు పాటు కడగాలి.*


*ఊరికే మొహం, ముక్కు, నోరు, కళ్ళు, తాకవద్దు. వీలయి నంత ఇంట్లోనే ఉండండి. దగ్గు, జలుబు ఉంటే అస్సలు ఎవరినీ తాకవద్దు. ఏ ఇబ్బంది ఉన్నా, వెంట నే గవర్న మెంట్ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించు కోండి.*


*మాస్క్ వేసుకొని, చేతులు కడుక్కుంటే. కరోనా రాదు అనే భ్రమ లో ఉండకండి. ఫుల్ బాడీ సూటులు వేసు కుని, అన్ని జాగ్రత్తలు పాటిస్తున్న డాక్టర్లకు కూడా ఇది వ్యాపించింది. మనుషు లందరూ ఒకరికొకరు, వీలయి నంత దూరంగా ఉండటం చాలా ముఖ్యం.*


*ఇంట్లో, పని ప్రదేశంలో అందరూ ఒకరి కొకరు, వీలయి నంత దూరంగా ఉండండి. మీకు వైరస్ సోకిందన్న విషయం, మొదటి పది రోజులు మీకు కూడా తెలియదు (incubation period) కానీ, ప్రక్క వారికి వ్యాప్తి చేస్తారు.*


*ఎదుటి వారి ఫేస్ టు ఫేస్, మొహం వంక చూస్తూ మాట్లాడ కండి. వీలయి నంత దూరంగా ఉండి, తల వంచు కొని మాట్లాడండి. కంటికి కనపడ కుండా, ఒకరి నోటి తుంపర్లు వేరొకరి మొహం మీదా. బట్టల మీద పడతాయి. తద్వారా, మీకూ వైరస్ సంక్రమిస్తుంది.* 


*దయచేసి ఈ జాగ్రత్త లన్నీ తూ.చ. తప్ప కుండా పాటించి కరోనా మహ మ్మారికి మన భారతీయులు బలవ్వకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయండి.*
*జై హింద్ !