జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.



  వైద్య కళాశాలల్లో ప్రవేశానికి వీలు కలిపించే జాతీయ అర్హత పరీక్ష 'నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌' (నీట్‌) వాయిదా పడింది. 


ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది.


 కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేసినట్టు సమాచారం. 


 షెడ్యూల్‌ ప్రకారం మే 3న ఈ పరీక్ష జరగాల్సి ఉంది. 


అయితే, ఈ నెల 27న అడ్మిట్‌ కార్డులు జారీ చేయాల్సి ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆ ప్రక్రియ కూడా వాయిదా పడింది.