ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన.. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యం.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు కారుకు ఓట్ల వర్షం కురిపిస్తున్నాయి. ఎన్నికలేవైనా అందులో వచ్చే ఫలితం మాత్రం ఏకపక్షమే. . అసెంబ్లీ, పంచాయతీ, పరిషత్ ఎన్నికల ఫలితాలే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరావృతమయ్యాయి. నాలుగు కార్పొరేషన్లలో, 9 మున్సిపాలిటీలలో పోలైన మొత్తం ఓట్లలో 44.50 శాతం ఓట్లు కారు గర్తుపైనే పడగా, కాంగ్రెస్‌కు కేవలం 20.84శాతం ఓట్లు అంటే టీఆర్‌ఎస్‌కు వచ్చిన వాటిలో సగంకంటే తక్కువ, అలాగే బీజేపీ 12.75 శాతం మాత్రమే వచ్చాయి. బీజేపీకి స్వతంత్ర అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే 6.38 శాతం తక్కువ రాగా, కాంగ్రెస్‌కు స్వతంత్రుల కంటే 1.71 శాతం ఎక్కువగా వచ్చాయి.