ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా కరోనా వైరస్ బారినుంచి తమను తాము కాపాడుకోవచ్చని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ రాకేశ్‌మిశ్రా పేర్కొన్నారు. కరోనా వైరస్ స్పర్శ, గాలి వల్ల ఒకరినుంచి మరొకరికి వ్యాప్తిచెందే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తలు పాటించాలని, చేతులను తరుచూ సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఈ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. గురువారం ఆయన ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. కరోనా వైరస్ సోకిన వ్యక్తికి సాధారణ జలుబు లక్షణాలే ఉంటాయని చెప్పారు.