కరోనా సోకినట్టు అనుమానం ఉన్న ఇద్దరు వ్యక్తులకు హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్ దవాఖానల్లో చికిత్స అందిస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. చైనా నుంచి ఇటీవల వచ్చిన ఒక వ్యక్తి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఫీవర్ దవాఖానలో, మరో అనుమానిత రోగి గాంధీలో చికిత్స పొందుతున్నట్టు వివరించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల నిమిత్తం వారి నుంచి శాంపిల్స్‌ను సేకరించి, పూణెలోని వైరాలజీ విభాగానికి పంపనున్నట్టు వెల్లడించారు.