సంక్రాంతి రోజున ఉపవాస దీక్ష*
అమరావతి రైతుల ఉద్యమం ఉధృతం అవుతోంది. ఇప్పటికే పండుగను బహిష్కరించారు ఆ ప్రాంత రైతులు. ఇక సంక్రాంతి రోజు కూడా కాస్త వినూత్నంగా నిరసన తెలుపనున్నారు. అందుకే ముందుగా తలపెట్టిన వంటా వార్పునూ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పండుగ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేసి తమ ఆవేదనను వ్యక్త పరచనున్నట్లు రైతులు పేర్కొన్నారు.
సంక్రాంతి రోజున ఉపవాస దీక్ష