*గెలిచి ఓడిన జగన్ 2019*
యువనాయకత్వంలో కొత్త ఆలోచనలతో
సుపరిపాలన అందిస్తారని సంక్షేమం అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆరంభంలో ఆశపడ్డ జనానికి చివర్లో నిరాశ మిగిలింది!
*అంశాలు వారీగా లోతుగా విశ్లేషిస్తే .*
- ఆరంభంలో "మంత్రి వర్గంలో సామాజిక న్యాయం"పై నాతో సహా విమర్శకుల ప్రశంశలు అందుకోగా చివరికి "సొంత సామాజికవర్గానికి న్యాయం" వైపు అడుగులు వేయటంతో విమర్శలపాలు!
- ఇంటింటికీ రేషన్ పింఛన్లు డోర్ డెలివరీ,సన్నబియ్యం పై ఆరంభంలో ఆశలు .. చివర్లో నిరాశ!
*యూటర్న్ . . .*
- హోదా,కేంద్ర నిధులు, పోలవరం అనే కీలక అంశాలలో ఎన్నికల ముందు భీకరపోరు చేసి గెలిచాక ప్రమాణస్వీకారం రోజే యూటర్న్!
*చిత్తశుద్ధి..*
- హామీల అమలులో చిత్తశుద్ధి ఏపాటిదో పెంఛన్ 'పెంపు'లో "భవిష్యత్ ముఖచిత్రం" తొలిసంతకంతో అర్థమైంది! - - - రైతు భరోసా కేంద్రంతో కలిపి అమలులో తేటతెల్లమైంది!
*విలువలతో కూడిన రాజకీయం..*
- ఎన్నికల ముందు ఫిరాయింపుల సాకుతో
అసెంబ్లీ బహిష్కరించి అదే అసెంబ్లీలో కొత్తరకం ఫిరాయింపులకు తెరలేపటం!
*దుబారా ఖర్చులు..*
- ఆరంభంలో హిమాలయ స్థానంలో కిన్లే
- చివరికి లక్షల జీతాలతో సలహాదారులు
- సొంతింటికి ప్రభుత్వ ఖర్చుతో కోట్లాది రూపాయలు
*కులముద్ర*
- నాడు ఆధారాలు లేని కమ్మని ఆరోపణలు నేడు ఆధారాలతో ఎర్రని పదవులు.
*మాట తప్పను*
- CPS రద్దు, సన్నబియ్యం, రాజధాని అమరావతి, అప్పులు, పరిశ్రమలు పెట్టుబడులు పై తను స్వయంగా చెప్పిన మాట తప్పటం.
*మడమ తిప్పను*
- కేంద్రం మెడలు వంచి హోదా నిధులు తెస్తామని మోదీ ముందు నడుములు వంచటం.
- రద్దు చేయల్సిన సీపీఎస్ రద్దు మినహా దాదాపు అన్ని రద్దు చేయటం.
*చెప్పేదొకటి చేసేది మరొకటి*
- స్పందనలో టైం రిసిప్ట్ అని అధికారులను ఆదేశించి
హోదా,కేంద్ర నిధులు, సీపీఎస్ రద్దు, ఫీజు రీయింబర్స్మెంట్ వగైరాపై టైం రిసిప్ట్ ఇవ్వకపోవడం.
- మధ్యం ఆదాయ వనరు కాదు అని చెబుతూ మధ్యం ధరలు విపరీతంగా పెంచటం
*సుపరిపాలన*
- బాబుపై కక్ష్యసాధింపు బాబు ముద్ర చెరిపేసే ప్రయత్నంలో ప్రజావేదిక కూల్చివేతతో మొదలై అన్న క్యాంటీన్ల రద్దు మీదుగా అమరావతి దాకా.
*విశ్వసనీయత*
- తాను స్వయంగా చెప్పిన మాటలు .. తన సొంత పత్రిక సాక్షిలో వచ్చిన రాతలపై అపనమ్మకం.
- రాజధాని,సన్నబియ్యం, సీపీఎస్ రద్దు, వగైరా.
*రాంగ్ స్టెప్పులు*
- ఇసుకరద్దు, 75% రిజర్వేషన్లు, పీపీఎల రద్దు,
భూములు అమ్మి సంక్షేమం, రాజధాని తరలింపు.
*విధానాలు*
- నూతన విధానాలు ఘనం, ఆచరణ శూన్యం.
- మహిళలు బీసీ,ఎస్సీ,ఎస్టీ లకు 50% రిజర్వేషన్లు
రివర్స్ టెండరింగ్, ఓ కొత్తరకం తనవారికి రికవరింగ్.
*అయోమయం గందరగోళం*
- సీఎం నోరు మెదపరు మంత్రుల నోటికి విలువ లేదు కీలక అంశాలపై జనానికి స్పష్టత ఉండదు.
- కేంద్రం నిధులు ఇవ్వటం లేదు
- పెట్టుబడులు రాలేదు
- రాష్ట్ర ఆదాయం పెరగలేదు
- జనం కొనుగోలు శక్తి పెరగలేదు
- ఆర్థిక పరిస్థితి అతలాకుతలం
- ఇప్పట్లో కోలుకోవటం కష్టం
- అరకొర సంక్షేమం అభివృద్ధి - శూన్యం.
- పాతభవనాలకి మూడురంగులు వేసుకుని.
- పాతపథకాలకు పేర్లు మార్చుకుని.
- పాత విధానాలని కొత్తవిధానాలుగా చెప్పుకుని.
ఏడు నెలల్లో ఒకటి రెండు అంశాలు మినహా చేసింది ఏమీ లేక కులం,మతం,ప్రాంతం మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటూ బాబుపై బురద చల్లుకుంటూ కాలక్షేపం చేస్తూ తండ్రి పథకం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వలేక తను సొంతంగా ఉద్యోగాలు ఇచ్చిన వారికి జీతాలు ఇవ్వలేక అప్పుల పరిధి దాటి భూములు అమ్మే స్థాయికి ఆంధ్ర భవిష్యత్తుని అగమ్యగోచరంగా మార్చి అతి తక్కువ రికార్డు సమయంలో పరాజయ ముఖ్యమంత్రి అని పేరుతెచ్చుకున్న ఏకైక సీఎం జగన్ మోహన్ రెడ్డి.