సంక్రాంతి వేడుకలలో పాల్గొన్న తలసాని

 


పశ్చిమ గోదావరి జిల్లా ఉండి లో  సంక్రాంతి వేడుకలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్. మంగళవారం నాడు భీమవరం లోని కోట్ల ఫంక్షన్ హాల్ లో  రామరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి పండుగ వేడుకలలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి అనంతరం భోగి మంటలు వెలిగించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్. మంత్రికి ఘనంగా స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు సత్యనారాయణ రాజు, సర్ రాజు, రామకృష్ణ రాజు తదితరులు పాల్గొన్నారు.