రైతు భరోసా పధకం పై త్వరలో  గ్రామాల్లో పర్యటించనున్న అధికారులు

రైతు భరోసా పధకం పై త్వరలో  గ్రామాల్లో పర్యటించనున్న అధికారులు


*రాష్ట్ర ప్రభుత్వం రైతులు సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రవేశపెట్టిన రైతు భరోసా పధకం ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే లక్ష్యం తో మైలవరం నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో అధికారులు  పర్యటించనున్నట్లు శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు తెలిపారు*


*ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రవేశపెట్టిన రైతు భరోసా పధకం ద్వారా గ్రామాల్లోని రైతులందరీకి లబ్ది చేకూరడం లేదని రైతులు స్థానిక నాయకుల నుండి వస్తున్న సమాచారం మేరకు వ్వవసాయ, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు వారిని గ్రామాల్లోకి వెళ్లి గ్రామ సభలు నిర్వహించి రైతులందరీకి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు*


*ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారి సూచన మేరకు అధికారులు త్వరలో గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి వారికి రైతు భరోసా పధకం ద్వారా లబ్ది చేకూరడం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైతులు అధికారులను కలిసి ప్రభుత్వం అందించే లబ్ది పొందవచ్చు*