వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చొరవ తో గొల్లపూడి శివారు సూరాయిపాలెం స్మశాన వాటిక కు మోక్షం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చొరవ తో గొల్లపూడి శివారు సూరాయిపాలెం స్మశాన వాటిక కు మోక్షం


*సూరాయిపాలెం స్మశాన వాటిక లో కంపచెట్లు చెత్త చెదారం పెరిగి అధ్వాన్నంగా ఉంది. ప్రజలు కర్మ కాండలకు ఇబ్బంది పడుతున్నారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న గొల్లపూడి  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారికి తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు స్మశాన వాటిక లో  కంపచెట్లు చెత్త చెదారం తోలగింపు పక్రియ చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారి ఆదేశాలు మేరకు గొల్లపూడి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్వీనర్ కారంపూడి సురేష్ గారు ప్రోక్లేయిన్ సహాయం తో కంపచెట్లు చెత్త చెదారం తొలగించి చదును చేయించడం జరిగింది. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు*