షోరూమ్‌లో బండి కొంటున్నారా..? ఈ కొత్త కండీషన్ తెలుసా..?
వాహనాల రిజిస్ట్రేషన్ బాధ్యత షోరూం నిర్వాహకులదే
కొనుగోలు చేసిన మూడ్రోజుల్లో నెంబర్ ప్లేట్లు అమర్చాలి
నెంబర్ ప్లేటు లేని వాహనాలు పట్టుబడితే భారీ జరిమానా
జీవో నెం 24 విడుదల
వాహనాల రిజిస్ట్రేషన్లు, నెంబర్‌ప్లేట్లను అమర్చే విధానం ఇప్పటి దాకా రవాణాశాఖ చూసుకుంటుండగా తాజాగా మో టార్ వెహికిల్ చట్టంలో మార్చారు. రిజిస్ట్రేషన్ తరువా త నెంబర్‌ప్లేట్‌లను ఏర్పాటు చేసే అధికారం వాహ నం విక్రయించిన షోరూమ్‌లకే అప్పగించింది. ఈ నిబంధనలు వెంటనే అమలులోకి తీసుకొస్తూ జీవో నెం 24 ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో శుక్రవా రం డీటీసీ దుర్గా ప్రమీల రవాణాశాఖ కార్యాలయంలో పట్టణంలోని అన్ని రకాల వాహనాలను విక్రయించే షోరూమ్ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటుచేశారు. చట్టంలోని అంశాలను వారికి వివరించారు. వినియో గదారుడు వాహనం కొనుగోలు చేసిన తరువాత రిజి స్ట్రేషన్ చేసుకునే బాధ్యతను సంబంధిత షోరూమ్ నిర్వాహకులదే అని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసిన మూ డ్రోజుల్లోనే వాహనాలకు నెంబర్ ప్లేట్లు వేయాలని లేని పక్షంలో సంబంధిత షో రూమ్‌లకు భారీగా జరి మానాలు విధిస్తామని అన్నారు.