రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీల్లో రాజవొమ్మంగి విద్యార్థిని ప్రతిభ
రాజవొమ్మంగి, నవంబర్ 19 (: విశాఖపట్నంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీలో రాజవొమ్మంగి విద్యార్థిని ప్రతిభ కనబరిచింది. ఇటీవల విశాఖపట్నం సింహాద్రి ధర్మల్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం మాధవి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుండి వందలాది మంది విద్యార్థులు వచ్చి పాల్గొనగా మాధవి వేసిన చిత్రం ప్రథమ స్థానంలో నిలవగా 2000 నగదు బహుమతిని, గిఫ్టు, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. పాఠశాలలో 9వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్న మాధవి చిత్రలేఖనంలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనపరచి నందుకు పి ఎం సి చైర్మన్ గౌరీ శంకర్, వైస్ చైర్మన్ అక్కమ్మ, రామరాజు, హెచ్ఎం కే శ్రీనివాస్ లు అభినందించారు. ఉపాధ్యాయులు పి మంగరాజు, బుల్లబ్బాయి రెడ్డి, చిన్నారావు, పార్వతి తదితరులు పాల్గొన్నారు.