జ్వరం లేకున్నా వస్తున్న డెంగ్యూ
డెంగ్యూ వచ్చినా జ్వరం, బాడీ పెయిన్స్ లాంటి లక్షణాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో వారిలో కొందరు ప్లేట్‌లెట్లను బాగా కోల్పోతుండడంతో ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకుంటున్నారు
ఇది చాలా డేంజరస్. దీన్ని వైద్య పరిభాషలో 'అఫెబ్రిల్ డెంగీ' అంటారని వైద్యులు పేర్కొంటున్నారు.. ఇకపోతే అఫెబ్రిల్ డెంగీ' అంటే జ్వరంగానీ, ఇతర లక్షణాలు కానీ లేకుండా డెంగ్యూ రావడం అని అర్ధం.. ఇది ఎక్కువగా మధుమేహం ఉన్నవారికి, వయసు పైబడినవారికి, చిన్న పిల్లలకి, ఇమ్యునిటి పవర్ తక్కువగా ఉన్నవాళ్లకు ఈ జ్వరం లేని డెంగీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు.
ఇక ఇలా వచ్చే డెంగ్యూ చాలా ప్రమాదకరమైనదట. ఎందుకంటే తమకు డెంగీ వచ్చిందని పేషెంట్లకే తెలియదు కాబట్టి వాళ్లు డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళని పరిస్థితుల్లో విపరీత ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇక ఈ వ్యాధి వచ్చినప్పటికి జ్వరం ఇతర లక్షణాలు కనిపించక ప్లేట్ లెట్స్ కౌంట్ మాత్రం విపరీతంగా తగ్గిపోతుంది. ఇది ఎక్కువగా ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్ నెలల్లో అటాక్ అవుతోంది.
*దీని లక్షణాలు*
ఊరికే అలసటగా అనిపించడం, ఆకలి లేకపోవడం, ఒంటిపై దద్దుర్లు, బీపీ తగ్గడం లాంటివి జ్వరం లేకపోయినా, సంభవిస్తున్నాయంటే, అది డెంగీ కావచ్చు. అలా పరిస్థితులు అనిపిస్తే వెంటనే ప్లేట్ లెట్స్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. నాకేం అవ్వలేదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలు పోవడం ఖాయం.......!