*కూడేరులో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ*
-దౌర్జన్యాలు అరికట్టాలని డిమాండ్.
అనంతపురం జిల్లా కూడేరు మండలం ఇప్పేరు పంచాయతీ కార్యదర్శి మురళీపై టీడీపీ కార్యకర్తల దౌర్జనానికి ,బెదిరింపులకు నిరసనగా కూడేరులో అన్ని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.దౌర్జనానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గత సోమవారం ఇప్పేరు గ్రామంలో జరిగిన స్పందన కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పింఛన్ల విషయంపై వేట కొడవలితో హాజరయ్యారు.పంచాయతీ కార్యదర్శి మురళీని తీవ్రంగా బెదిరించారు. పెట్రోల్ పోసి నిప్పు పెడతామని హెచ్చరించారు.ఇందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో అనంతపురం పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు వెంకటనాయుడు, ముత్యాలరెడ్డి, అశోక్ బాబు, కూడేరు ఎమ్మార్వో నాగరాజు, కూడేరు ఎంపిడివో సౌజన్య, ఆంద్రప్రదేశ్ పంచాయతీ సెక్రెటరీల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ, ట్రెజరర్ శ్రీనివాసులు, ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ స్టేట్ అసోసియేషన్ కార్యదర్శి వర్ల శంకర్, జిల్లా పరిషత్ పంచాయతీ ఉద్యోగుల సంగం నాగభూషణం రెడ్డి , కూడేరు మండలం VRO లు, సర్వేయర్లు,AO నవత, మెడికల్ డిపార్ట్మెంట్ మోహన్బాబు, MGNREGS ఉద్యోగులు, కూడేరు మండలం సచివాలయ ఉద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు...