కార్తీకమాసం-సోమవారం సందర్భముగా  ఎంమ్మెల్యే ప్రత్యేక పూజలు


కార్తీకమాసం-సోమవారం సందర్భముగా  పి. గన్నవరం నియోజకవర్గం శాసన సభ్యులు గౌ. శ్రీ కొండేటి చిట్టిబాబు గారు కుటుంబ సమేతముగా అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి, శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజ నిర్వహించి, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర  స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించినారు. వీరికి తొలుత ఆలయ కార్యనిర్వహణాధికారి వారు, ప్రధాన అర్చకులు మరియు వేదపండితులు  పూర్ణకుంభంతో స్వాగతం పలికినారు. అర్చకులు  ఆశీర్వచనం అందజేసి, శేష వస్త్రములతో సత్కరించినారు. అనంతరం EO  గారు ప్రసాదములు అందజేసినారు.