లవ్లీ ప్రొఫెషనల్ విశ్వ విద్యాలయం (ఎల్‌పీయూ)లో చదువుతున్న ఓ విద్యార్థినికి మైక్రోసాఫ్ట్ నుంచి భారీ వేతన ఆఫర్ వచ్చింది. ఎల్‌పీయూలో 2019 ఏడాదికిగాను బీ.టెక్ (సీఎస్‌ఈ) నాలుగో సంవత్సరం చదువుతున్న తాన్య అరోరాకు మైక్రోసాఫ్ట్ రూ.42లక్షల వేతన ప్యాకేజీ (ఏడాదికి రూ.5.04కోట్లు) ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఉద్యోగంలో చేరాక తాన్యా.. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా ఆర్ అండ్ డీ సెంటర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేయనుంది. తాన్యాను చూసి గర్విస్తున్నట్లు వర్సిటీ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ వ్యాఖ్యానించారు. గత మూడేళ్లుగా ఎల్‌పీయూ విద్యార్ధులు రికార్డు స్థాయిలో ఉద్యోగాలు సాధించారు. ఫార్చ్యూన్– 500 కంపెనీల జాబితాలో ఉన్న హెచ్‌పీ, అమెజాన్, యాహూ, సిస్కో, ఆపిల్, గూగుల్ తదితరల దిగ్గజ సంస్థల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఉద్యోగాలు పొందారు.
లవ్లీ ప్రొఫెషనల్ విశ్వ విద్యాలయం (ఎల్‌పీయూ)లో చదువుతున్న ఓ విద్యార్థినికి మైక్రోసాఫ్ట్ నుంచి భారీ వేతన ఆఫర్