ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్క‌రించారు


.తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన 9 అడుగుల 3 అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ``ఎస్‌.వి.రంగ‌రావుగారు నా అభిమాన న‌టుడు. ఆయ‌న‌తో మా తండ్రీగారికి న‌టించే అవ‌కాశం ద‌క్కింది. నాన్న‌గారు ఆయ‌న న‌ట‌నా కౌశ‌లం గురించి నాతో ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయ‌న న‌ట‌న‌, డైలాగ్ డెలివ‌రీ కార‌ణంగానే ఇప్ప‌టికీ అందరు ఆయన్ని వేనోళ్ల పొగిడారు ఇప్పటికీ ఆయన్ని గుర్తుంచుకుంటున్నారు.