తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి విషాద ఛాయలు అలముకోవడం తెలిసిందే. ఇటీవలే బోటు మునక ఘటనలో అనేకమంది ప్రాణాలు కోల్పోగా, తాజాగా ఓ టెంపో లోయలో పడిన ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్నవరం దైవ దర్శనానికి వెళుతున్న భక్తులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు చంద్రబాబు ట్వీట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి, చింతూరు మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడి ఘాట్ రోడ్డులోని వాల్మీకి కొండవద్ద టెంపో వాహనం అదుపుతప్పి లోయలోకి జారిపోయింది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి