ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర
తెలంగాణ సాగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపుతూ సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ మీడియాకు విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం
ప్రవేటీకరణలో భాగంగానే ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడం లేదు!
ఆర్టీసి కార్మికుల డిమాండ్లను సాధించుకునే వరకు మిలిటెంట్ ఉద్యమాలు చేపట్టండి!
కార్మికుల సమ్మెకు అన్ని సెక్షన్ల ప్రజలంతా సంపూర్ణ మద్దతును ఇవ్వండి!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్ద్యేశ పూర్వకంగానే ఆర్టీసి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నష్టాలకు గరిఅయ్యేటట్లు చేసి నష్టాలకు కార్మికులే కారణమంటూ వారిపై నెట్టి చేతులు దులుపుకుంటుంది. కార్మికుల మౌళిక సమస్యలు పట్టించుకోకుండా పరిష్కరించకుండా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నది. మరో ప్రక్క ప్రభుత్వం చేవ చచ్చిన ఆర్టీసి యాజమన్యాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ పెత్తనం చేస్తుంది.
నష్టాల నుండి బయట పడడానికి ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఖాళీగా వున్న డ్రైవర్ కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణం చెల్లించాలని, మోటర్ వాహాన పన్నును మినహాయించాలని, ఆర్టీసి ఉపయోగిస్తున్న డిజిల్ వ్యాట్ నుండి మినహాయించాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆర్టీసికి పూర్తి స్థాయి మేనేజింగ్ డైరెక్టర్‌ను నియమించాలని పలు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి కార్మికులు అభివృద్ధిని కోరుకుంటుంటే వాటినన్నింటిని తోసి పుచ్చుతూ కార్మికులను బెదిరింపులకు గురి చేస్తున్నది.
గత్యంతరం లేక సమస్యల పరిష్కారానికి సమ్మెకు దిగుతే సమ్మె విరమించక పోతే ఎస్మా ప్రయోగిస్తామని, డిస్మిస్ చేస్తామని బెదిరింపులకు గురి చేస్తూ నిరకుంశత్వాన్ని ప్రదర్శిస్తున్నది. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పుతున్నది. కార్మికుల డిమాండ్లను ప్రక్క దారి పట్టించడానకి ఐఏఎస్ లతో చట్టబద్ధత లేని త్రిసభ్య కమిటీని ఏర్పరచి రాజీకుదుర్చుకొని దాటవేయాడానికి ప్రయత్నిస్తున్నది.
కార్మికులు ససేమిరా అనడంతో సమ్మెపై నిషేధాన్ని, నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నది. కార్మికుల డిమాండ్లను కనీస పరిగణంలోకి తీుకోకుండా ఆర్టీసిని నడుపడానికి ప్రత్యామ్నాయ మార్గాలను రూపొందించి పరిష్కారాలకు అడ్డ దార్లను వెతుక్కుంటున్నది. టిఆర్ఎస్ ప్రభుత్వమే పౌరుల ప్రాథమిక హక్కులను, వాక్ స్వతంత్య్రాన్ని కాలరాసి చట్టాలను సైతం తుంగలో తొక్కి న్యాయ పోరాటం చేస్తున్న కార్మికులనే చట్ట విరుద్ధంగా వ్వవహరిస్తున్నారని హితవు పలుకుతున్నది.
వాస్తవానికి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నుండి ఆర్టీసి నష్టాల ఊబిలో కూరుక పోతూనే వుంది. నష్టాల నుండి బయట పడడానికి కార్మికుల సమస్యలు పట్టించుకున్న పాపన పోలేదు. ప్రభుత్వమే ఆర్టీసి నష్టాలకు పూర్తి బాధ్యత వహించాలి. ఆర్టీసికి ప్రభుత్వం చెల్లించాల్సిన కోట్ల రూపాయాల బకాయిలను ఎగవేస్తూ, మరో ప్రక్క అదే ప్రభుత్వం వాహానాల పై పన్ను, డిజిల్ పై వ్యాట్ వసూల్ చేస్తున్నది. కొత్త వాహానాలు కొనుగోలు, కాంట్రాక్టు కార్మికుల క్రమ బద్ధీకరణ, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదు. పైగా కార్మికులపై బదనాం మోపి టిఆర్ఎస్ ప్రభుత్వం భాధ్యత నుండి తప్పుకుంటున్నది.
ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు వారి న్యాయమైన డిమాండు వెంటనే పరిష్కరించాలి. ప్రైవేటీకరణలో భాగంగా జరుగుతున్న ఉద్దేశ పూర్వక ప్రత్యామ్నాయ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం మానుకోవాలి. కార్మికులపై కొనసాగిస్తున్న నియంతృత్వ విధానాలను తక్షణమే మానుకోవాలి. నియంత ప్రభుత్వాలు ప్రజల ఆవేశానికి గురి కాకతప్పదు.
ఆర్టీసి కార్మికులంతా తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను విరమించకుండా విరోచితంగా పోరాడండి. పోరాడితేనే మన సమస్యలకు అంతిమ పరిష్కారాలుంటాయి. లేదంటే వున్న ఉద్యోగాలు పోయి బజారున పడుతారు. అవసరమైతే త్యాగాలకు సిద్ధం కండి. కార్మికుల న్యాయమైన డిమాండకు అన్ని సెక్షన్ల ప్రజలంతా తమ సంపూర్ణ మద్దతును అందించండి. వారితో భుజం కలిపి పోరాడండి