జగన్ ప్రభుత్వంపై కొంతమంది వైసీపీ సానుభూతిపరులు
పేస్ బుక్, వాట్సప్ గ్రూపులలో చేసే కామెంట్స్ చూస్తే ఎంతో బాధ వేస్తోంది.
జగనన్న ప్రభుత్వం వచ్చి కేవలం నాలుగు నెలలే దాటింది.
ఇంతలోనే...,
రెడ్లను పట్టించుకోవడం లేదని కొంతమంది,
తాము పార్టీకోసం కష్టపడినా తమకు వలంటీర్ పోస్టులు రాలేదని ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు.
లేదంటే.. తమ MLA పట్టించుకోవడం లేదనో లేక స్థానిక నాయకుడు పట్టించుకోవడం లేదనో ,
పార్టీ లోనో ప్రభుత్వం లోనో పదవులు రాలేదనో మరో కారణం చేతనో విమర్శిస్తూ వస్తున్నారు
నిజమే...!
మీలో కొంతమంది,.. పార్టీ కోసం కష్టపడి ఉంటారు... కాదనలేం
కానీ అందరికీ న్యాయం, అది కూడా వెంట వెంటనే న్యాయం చేయడం ఎవరికీ సాధ్యం కాదు
లచ్చ కోట్లు లచ్చ కోట్లు అంటూ బాబు అను కుల భజన మీడియా ఈనాడు, జ్యోతి, TV5, ABN
జగన్ గారి మీద చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. అది మీకు తెలియంది కాదు.
అదంతా తప్పుడు ప్రచారం అని జగన్ గారు ప్రూవ్ చేయాలనుకొంటున్నాడు..
అందుకనే పార్టీ నాయకులకు ఆదాయ వనరులుగా ఉండే ఇసుకను, మద్యాన్ని ప్రభుత్వ పరం చేశాడు.
వంద కోట్ల రూపాయల అంచనాలు దాటిన కాంట్రాక్టులన్నింటినీ జడ్జి పర్యవేక్షణకు, పరిశీలనకు పెట్టి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నాడు
కాబట్టి...
వెంటనే పదవులు లేదా పనులు కావాలి అంటే కుదరదు...
కొంచెం టైం పడుతుంది, అంతా ఓపిక పట్టాలి.
తెలుగు కాంగ్రెస్ కుట్రల పుణ్యమా.., అని జగనన్న 18 నెలలు జైలులో ఉండి ఏడాదికి పైగా ఎండనకా వాననకా పాదయాత్ర చేసి చెమటోడ్చి మీ లాంటి అభిమానుల మద్దతుతో కష్టపడి సాధించుకున్న విజయ లక్ష్మిని ఎందుకు వదులుకుంటాడు?
అలా అని,..ఏ వర్గాన్నోనిర్లక్ష్యం చేస్తాడనుకోవడం పొరపాటు.
అంత సులభంగా ఆయన వచ్చే ఎన్నికల్లో గెలుపును వదులుకుంటాడా?
మనం ఏ చిన్న తప్పు చేసినా భూతద్దంలో చూపే ఎల్లో మీడియా కాచుకుని ఉంది.
కాబట్టి జాగ్రత్తగా ఉండాలి..లేదంటే దెబ్బతింటాం.
ఇంకో 30 ఏళ్ళు పాలించాలని, తన తండ్రి లాగా పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకోవాలనే కసితో ఉన్న జగనన్న
కొంచెం నెమ్మదిగా అయినా సరే.. తగు న్యాయం చేస్తాడు, మనమంతా కొంచెం ఓపిక పట్టాలి...అంతే!
ఆవేశంతో వెళ్తే, అనర్ధాలు తప్ప లాభం ఉండదు
పోస్టులు కామెంట్లు పెట్టేటప్పుడు కాస్త ఆలోచించండి.
మీ అభిమానం వెలకట్టలేనిది.
కానీ ఆవేశం ఎప్పుడూ పనికిరాదు, ఆలోచించండి..
దయచేసి సహకరించండి.