ఆర్టీసీ సమ్మెకారణంగా విద్యార్దులు ఇబ్బందులు పడకుండా విద్యాసంస్థలకు సెలవులను ఈనెల 19వ తదీ వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. అప్పటిలోగా పూర్తిస్థాయిలో బస్సులు సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా మరిన్ని ప్రైవేట్ బస్సుల కోసం నోటిఫికేషన్ జారీ చేయాలని కూడా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. విద్యాసంస్ధలకు దసరా సెలువులు పూర్తయినా బస్సులు సకాలంలో అందుబాటులో లేక పోవడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగానే విద్యాసంస్థల్లో హాజరు శాతం తగ్గింది. దీంతో మరికొన్ని రోజుల పాటు విద్యాసంస్థలకు సెలువులు పొడిగించాలని నిర్ణయించారు.
విద్యాసంస్థలకు సెలవులను ఈనెల 19వ తదీ వరకూ