దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కోర్టు కేసులు ముప్పతిప్పలు పెట్టిస్తున్నాయి .ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టై ఏలూరు సబ్ జైలులో ఉన్న చింతమనేనిపై 2011లో కోడి పందాల కేసులో విజయవాడ స్పెషల్ కోర్టు పిటి వారెంట్ జారీ చేసింది. అందులో భాగంగా బుధవారం చింతమనేనిని ఏలూరు సబ్ జైలు నుంచి విజయవాడ స్పెషల్ కోర్టులో హజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి గతంలో వాయిదాలకు హజరు కాకా పోవడంతో పీటీ వారెంట్ జారీ చేసిన విజయవాడ స్పెషల్ కోర్టు బెయిల్ పిటీషన్‌ను రేపటికి వాయిదా వేసింది. చింతమనేనిపై 2011లో యానిమల్ యాక్ట్ కింద ఈ కేసు నమోదైంది.
చింతమనేని ప్రభాకర్‌ను వదలని కోర్టు కేసులు