నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన పోలీస్ శాఖ.
*_దీపావళి సందర్భంగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నయీమ్ హష్మి జర్నలిస్టు కుటుంబాలకు మిఠాయిలు పంపిణీ చేసి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు._*
*_ఇంతవకూ జిల్లాలో పనిచేసిన పోలీస్ అధికారులు ప్రెస్ మీట్స్, పోలీస్ సంభందిత కార్యక్రమాలలో మాత్రమే జర్నలిస్టులకు పలహరాల్తో సరిపుచ్చుకోడం మినహా, వారి కుటుంసభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొన్న సందర్భం లేదు._*
*_జిల్లా ఎస్పీ హష్మీ మాత్రం దీపావళి సందర్భంగా జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టు కుటుంబం సంతోషంగా పండుగ జరుపుకోవాల నే ఉద్దేశ్యంతో మిఠాయిలను పంపిణీ చేసి జర్నలిస్ట్ ల హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు._*
*_"మిఠాయిలకే ఇంత పొగడ్తలు" అవసరమా అంటే అవసరమే అని చెప్పక తప్పదు._*
*_సాధారణంగా జర్నలిస్టులకు బహుమతులు ఇచ్చే వారు ఫలానా చోటకి వచ్చి తీసుకొని వెళ్ళండంటు సమాచారం ఇవ్వడం పరిపాటి._*
*_మత సామరస్యానికి ప్రతీకగా హిందువులు జరపుకునే దీపావళి పండుగకు స్వయంగా పోలీస్ అధికారితో జర్నలిస్టుల ఇంటికి మిఠాయిలను పంపించి ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు జిల్లా ఎస్పీ హష్మీ._*