విశాఖ, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. విశాఖ జిల్లా చోడవరం, చీడికాడ, మాడుగుల, బుచ్చయ్యపేట, రావికమతం, నర్సీపట్నం, కోటవురట్ల ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పుగోదావరి జిల్లా తుని, రౌతులపూడి, కోటనందూరు, శ్రీకాకుళం జిల్లా సీతంపేట, పాతపట్నం, భామిని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ తెలిపింది. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆర్టీజీఎస్ హెచ్చరిక జారీ చేసింది.