"రిపబ్లిక్ ఆఫ్ లైస్" అనే ఒక పుస్తకంలో పేరాగ్రాఫ్ ఇది.
అమెరికాలో అమలైన ఈ సోషల్ మీడియా కుట్రని ఆకళింపు చేసుకున్న ప్రశాంత్ కిశోర్ బృందం, వైసిపి, బిజెపి సోషల్ మీడియా టీమ్ ఇదే మోడస్ ఆపరాండి ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేశాయి.
వందలకొద్దీ ఫేస్‌బుక్ పేజీల్ని, వేలకొద్దీ ఫేక్ అకౌంట్లనీ సృష్టించాయి. కొన్ని పేజీలు మన విశాఖ, రైతుబిడ్డ, మంచి సూక్తులు, సినిమా కామెడీ...ఇలా న్యూట్రల్‌గా ధ్వనించే పేర్లతో నడపడం. లోపల కంటెంట్ మాత్రం నాలుగు జనరల్ అంశాలు, ఒకటి కులవిద్వేషపు రూమర్. ప్రతి పేజీలోనూ కమ్మకులాన్ని, తెదేపాలో ఉన్న ఆ కులపు ప్రతినిధుల్ని దుర్మారుగులుగా, దౌర్జన్యకారులుగా చిత్రీకరిస్తూ రూమర్లు, వార్తలు సృష్టించడం, అవి సామాన్యప్రజానీకానికి ఫేస్‌బుక్ న్యూస్‌ఫీడ్‌లోనూ, వాట్సప్ గ్రూపుల ద్వారానూ వెళ్ళేట్లు చేయడం. ఇక బిజెపివారు పనిగట్టుకుని హిందుత్వ పేజీల్లో చంద్రబాబుని, తెదేపాని హైందవవ్యతిరేకులుగా, దేవాలయ విధ్వంసకులుగా చిత్రీకరించి బ్రాహ్మణుల్లో, వైశ్యుల్లో తెదేపా పట్ల వ్యతిరేకత సృష్టించడం.
ఈ కుట్రలో ఇంకో దుర్మార్గపు అంకం, చౌదరి అని తోక తగిలించి వందలకొద్దీ ఫేక్ ప్రొఫైల్స్ వీళ్ళే క్రియేట్ చేసి, ఆ ఎకౌంట్ల ద్వారా కమ్మ కులపిచ్చి పీక్స్‌కి చేరినట్లు పోస్టులు పెట్టించడం. చౌదరి అనే తోకతో, ఎన్టీయార్, చంద్రబాబు, తెదేపా బొమ్మలతో, జై కమ్మ-జై జై కమ్మ వంటి స్లోగన్స్‌తో ఆ ఫేక్ ప్రొఫైల్స్ నిండిపోయి ఉంటాయి. ఈ ప్రొఫైల్స్ ప్రతిరోజూ కాపులను, బ్రాహ్మిణులను, ఇతర కులాలను మదమెక్కిన రాతలతో తిడుతూ ఉంటాయి . వీటిలో అకారణంగా జులుం ప్రదర్శించే పోస్టులుంటాయి. "ప్రభుత్వం మాదిరా, తంతాం మిమ్మల్ని" అంటూ ఇతర కులాల్ని బెదిరిస్తూ పోస్టులుంటాయి. ఈ పోస్టులతోబాటు "కమ్మవాడికి సాటి ఎవ్వడు - మాకు అడ్డొచ్చేదెవ్వడు" తరహా పోస్టర్లని వీళ్ళ సోషల్ మీడియా సెంటర్లలో డిజైన్ చేయించి ఈ ఫేక్ చౌదరి అకౌంట్ల ద్వారా సోషల్ మీడియాలోకి వదలడం. అవి చూసి ఇతర కులాలవారికి జుగుప్స కలిగి తీవ్రవ్యతిరేకత రావడం. ఓకే, తెదేపా అధికారంలో ఉంటే కమ్మవారు ఇలా దాష్టీకంగా ప్రవర్తిస్తారు అనే ముద్ర వేసి, వీరి మీద వ్యతిరేకతని తెదేపా మీదకి మళ్ళించి, ఆల్టర్నేటివ్ శక్తిగా జగన్మోహన రెడ్డికి ఆ వర్గాల ఓట్లు పడేలా చేయడం ఈ కుట్ర అంతిమ లక్ష్యం. ఈ కుట్రని అమలుచేయడంలో బాగా సఫలీకృతులయ్యారు.
ఇప్పటికీ ఈ ఫేక్ కమ్మ ప్రొఫైల్స్ చాలా నడిపిస్తున్నారు వైసీపీవాళ్ళు. అనిల్ కుమార్ యాదవ్ గారినో, బొత్సగారినో, పవన్ కల్యాణ్‌నో, వేరే దళిత నాయకుల్నో కులం పేరుతో దూషిస్తూ ఉంటాయి ఈ ప్రొఫైల్స్. ఇలా నిరంతరం కమ్మవ్యతిరేకతని రగిలిస్తూ తమ పబ్బం గడుపుకోవాలనేదే వైసీపీ నీచవిధానం. న్యూట్రల్స్ ఇప్పటికైనా సత్యాన్ని గ్రహిస్తే రాష్ట్రానికి మేలు చేసినవాళ్ళవుతారు.