రేషన్ డీలర్ల అసోషియేషన్ గౌరవ అధ్యక్షుడు వెంకయ్య వైఎస్ఆర్ పార్టీలో చేరిక


అమలాపురంలో కల్వకొలను వీధి 6వ వార్డుకు చెందిన ప్రముఖ 
నాయకులు.. పిండి వెంకయ్య వైఎస్సార్ పార్టీ లో జాయిన్ అయ్యారు. మంత్రి విశ్వరూప్ ఆయన్ను పార్టీ కండువా కప్పి వైకాపాలోకి ఆహ్వానించారు.
 వెంకయ్య అమలాపురం డివిజన్ రేషన్ డీలర్ల అసోషియేషన్ గౌరవ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. గతంలో  శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ అధ్యక్షుడు గా పనిచేశారు. వెంకయ్య తో పాటు వైకాపా నాయకులు వంటెద్దు వెంకన్నాయుడు, కల్వకొలను బాబీ తదితరులు ఉన్నారు.