ఇదేనా ప్రజా పరిపాలన

జగన్ అప్రమత్తంగా ఉండాలి : ఉండవల్లి 


 


వచ్చాడయ్యో సామీ...


 


కనీసం తనఊరికి దగ్గిర్లోనే బోటు మునిగి ముప్పయ్యిమందికిపైగా చనిపోతే నోరెత్తని ఈయన ....కృత్రిమ వరదలు సృష్టించి వేలఎకరాల పంటనీటమునిగితే అడ్రస్ లేని ఈయన... ఇసుక మాఫియా రంగంలోకి దిగి మన రాష్ట్రానికి ఇసుక అందకుండా తెలంగాణాకి అక్రమరవాణా చేసి లక్షలమంది భవన నిర్మాణకూలీల నోట్లో  అన్నంముద్ద తీసేస్తే స్పందించని ఈయన....అన్న కాంటీన్లని మూసేసి లక్షలమంది పేదల కడుపుమీద కొడితే కంటికి కనిపించని ఈయన....రోజుకి మూడున్నర ఎకరాల చొప్పున శేషాచలం అడవుల్లో  ఎర్రచందనం చెట్లని నరికి దేశాలు దాటిస్తుంటే పక్షవాతం వచ్చినట్లు పడిపోయిన ఈయన ...మిగులువిద్యుత్ తో పక్కరాష్ట్రాలకికూడా విద్యుత్ అమ్మేస్థితిలో ఉన్నరాష్ట్రాన్ని నేడు కరెంటు కోతలతో కటకటలాడేట్లు చేస్తుంటే కళ్ళు కాకులెత్తుకుపోయినట్లు నటిస్తున్న ఈయన....ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దాదాపు మ్యాప్ లో లేకుండా చేస్తుంటే చేష్టలుడిగినట్లు చూస్తున్న ఈయన ఈరోజు సీ ఎం  కి సలహాలు ఇవ్వడానికి మీడియా ముందుకొచ్చాడు....


 


ఈయనకి మీడియా ముందుకి రావడానికి సిగ్గెక్కడుందో అర్ధంకాలా...నువ్వొక మేధావివా? దేన్లో మేధావివి? లక్షకోట్లు ప్రజాధనం దోచుకుంటే ఆ కేసుల్లోనుంచి బయటపడడానికి లాయర్ గా దొంగ సలహాలివ్వడంలో మేధావివి...లక్షలఎకరాల పంటపొలాల్ని సాగులోకి తీసుకొచ్చిన పట్టిసీమ ఎందుకుకట్టారో అంటూ మీడియాకెక్కిన కళ్లుండి కబోదిలా నటిస్తున్న మేధావివి....ఏం ఉపయోగం నీవల్ల రాష్ట్రానికి? 


 


తుగ్లక్ పరిపాలనలో రాష్ట్రం దారుణంగా నష్టపోతుంటే హైదరాబాద్ లో కూర్చుని పకోడీలు తింటూ మీడియా ముందుకొస్తావా? అసలు పదేళ్లు ఎంపీగా రాష్ట్రానికి ఏంచేశావు? వై.ఎస్ చేస్తున్న దారుణాలని, అక్రమాలని జాతీయమీడియాలో వెనకేసుకురావడం తప్పించి రాష్ట్రంకోసం నువ్వు చేసిందేమైనా ఉందా? ఇంకా నీ సొల్లు వినడానికి మీడియావాళ్ళు వచ్చారంటే వాళ్ళెంత పనీపాటా లేకుండా గాలికి తిరుగుతున్నారో అర్ధం అవుతుంది...