ఓ కలం ఆగిపోయింది అనేక దశాబ్దాల పాటు ప్రజాసమస్యల పరిష్కారమే లక్షంగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విదానాలపై అలుపెరుగని పోరాటం చేసిన ఆ కలం ఆగిపోయింది. ప్రలోబాల పర్వం పతాక స్థాయి లో సాగుతున్న సమయంలో దేనికి లొంగని కలం అది పేరులోనేకాదు ఆయన పాత్రికేయ జీవితం మొత్తం చక్రవర్తి లానే గడిపిన చక్రవర్తుల రాఘవచారి గారు ఈ రోజు తుది శ్వాస విడిచారు. కొంత కాలం గా అనారోగ్యంతో బాధ పడుతూ హైద్రాబాద్ లో చికిత్స పొందుతున్నారు. వరంగల్ జిల్లా లో జన్మించిన ఆయన ఎఐయస్ యస్ విద్యార్థి సంఘం నాయకునిగా పనిచేశారు. బహు భాషా కోవిధుడైనా రాఘవచారి గారు విశాలాంధ్ర దినపత్రిక కు సుదీర్ఘ కాలం ఎడిటర్ గా పని చేశారు ఆయన కలం తో పాటు గళం గొప్పదే మంచి వక్త. మీరు అని తప్ప నీవు అని సంభోధించటం తెలియదు. పాత్రికేయ లోకం లో ఓ మేరు నగ శిఖరం నెలకొరిగింది ఆయన ఖ్యాతి అజరామరం. విలువల రారాజు రాఘవచారి గారికి వినమ్ర నివాళి అర్పిస్తూ*
ఓ కలం ఆగిపోయింది