జియో దీపావళి కానుక- రూ.699కే జియోఫోన్‌

 


జియో దీపావళి కానుక- రూ.699కే జియోఫోన్‌
- పాత ఫోన్ ఎక్సేంజ్ చేసుకోవ‌డం అవ‌స‌రం లేదు
-దస‌రా నుంచి దీపావ‌ళి వ‌ర‌కు ప‌రిమిత కాల ఆఫ‌ర్‌
- వినియోగ‌దారుల కోసం అందిస్తున్న బ‌హుమ‌తుల మొత్తం విలువ‌ రూ. 1500
హైదరాబాద్, అక్టోబ‌ర్ 1, 2019: డిజిట‌ల్ సొసైటీలోకి వాస్త‌వంగా మ‌రియు ఆక‌ర్ష‌ణీయరీతిలో భార‌త‌దేశం సాగే ప్ర‌యాణం మొద‌లైంది. ప్ర‌పంచ పోక‌డ‌ల‌కు త‌గిన రీతిలో రాశిలో, వాసిలోనూ దేశం ముందుకు సాగుతోంది. అయితే, ఈ ప్ర‌య‌త్నం విజ‌య‌వంతం అయ్యేందుకు డిజిట‌ల్ విప్ల‌వం యొక్క ఫ‌లాలు అంద‌రికీ చేరువ అయ్యేలా, ఏ ఒక్క భార‌తీయుడు కోల్పోకుండా ఉండేలా మ‌నం కృషి చేయ‌డం ఎంతో ముఖ్యం.
                                                      సాంకేతికంగా అనుసంధానం కొన‌సాగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో...అందుబాటు ధ‌ర‌లో ఇంట‌ర్నెట్ ల‌భ్య‌మ‌వ‌డం అనేది కూడు, గుడ్డ మ‌రియు నీడ వ‌లే మ‌నుషుల కనీస అవ‌స‌రం మ‌రియు ప్రాథ‌మిక‌ హ‌క్కుగా మారిపోయింది. అందుకే, దేశ‌వ్యాప్తంగా జియో ద్వారా అందిస్తున్న వాయిస్ కాలింగ్ సేవ‌ల‌కు తోడుగా, డాటా సేవ‌ల‌ను సైతం అవ‌స‌రం ఉన్న ప్ర‌తి ఒక్క భార‌తీయుడికి జియో చేరువ చేసింది. ఇత‌ర పోటీదారులు నాసిర‌క‌మైన 2జీ డాటాను అందిస్తూ ఒక జీబీ డాటాకు రూ.500 వ‌సూలు చేస్తున్న త‌రుణంలో, అత్యంత నాణ్య‌మైన 4జీ డాటాను అత్యుత్త‌మ‌మైన 4జీ నెట్‌వ‌ర్క్‌తో అందుబాటు ధ‌ర‌లో జియో అందించింది. ఇంతేకాకుండా, ప్రపంచంలోనే అతి త‌క్కువ ధ‌ర క‌లిగిన 4జీ సేవ‌ల ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను సాధార‌ణ భార‌తీయులంద‌రు ఉప‌యోగించుకునేలా జియో చేయ‌గ‌లిగింది. ప్ర‌తి ఒక్క భార‌తీయుడు గ‌ర్వంగా తెలుసుకోవాల్సిన విష‌యం ఏమిటంటే...జియో స్మార్ట్‌ఫోన్ ఒక్క‌టే భార‌త‌దేశంలో త‌యార‌వుతోంది,భార‌తీయులచే త‌యారవుతోంది,భార‌తీయుల కోసం రూపొందించ‌బ‌డుతోంది మరియు భార‌త‌దేశం యొక్క ఆపరేటింగ్ సిస్ట‌మ్‌ను క‌లిగి ఉన్న ఏకైక స్మార్ట్‌ఫోన్‌. ప్ర‌స్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌ల‌తో పోలిస్తే నాలుగో వంతు ధ‌ర‌లోనే రూ. 1500 జియోఫోన్ అందుబాటులోకి వ‌స్తోంది.
జియోఫోన్ అందుబాటులోకి వ‌చ్చిన నాటి నుంచి నేటి వ‌ర‌కు, దాదాపు 7 కోట్ల మంది 2జీ వినియోగ‌దారులు జియో ఫోన్ ప్లాట్‌ఫాంను వినియోగించుకుంటున్నారు.తద్వారా శ‌క్తివంత‌మైన డిజిట‌ల్ సేవ‌ల‌ను పొంద‌గ‌లుగుతున్నారు. అయిన‌ప్ప‌టికీ, డిజిట‌ల్ ఇండియా యొక్క క‌ల పూర్తిగా నెర‌వేరాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంది. ఎందుకంటే, ప్ర‌స్తుతం భార‌త‌దేశంలోని దాదాపు 35 కోట్ల‌కు పైగా ప్ర‌జ‌లు నేటికి 2జీ నెట్‌వ‌ర్క్‌ను వినియోగిస్తున్నారు మ‌రియు వారికి స్మార్ట్‌ఫోన్ సేవ‌లు అందుబాటులో లేవు. వారు పేద‌రికం బాధితులుగా ఇంకా మిగిలిపోవ‌డం వ‌ల్ల...అతి త‌క్కువ ధ‌ర క‌లిగిన జియోఫోన్ సైతం వారికి అందుబాటులో లేదు. ఈ 35కోట్ల 2జీ వినియోగ‌దారులు ముందు ప్ర‌స్తుతం అతి సంక్లిష్ట‌మైన స్థితి ఉంది. డాటా స‌ర్వీసుల‌పై ఆశ‌లు వ‌దిలేసుకోవ‌డం లేదా నాణ్య‌త‌లేని 2జీ డాటా సేవ‌ల కోసం అత్యంత ఎక్కువ ధ‌ర‌ను చెల్లించ‌డం మాత్ర‌మే వారి ముందున్న అవ‌కాశం. ఇంతేకాకుండా వారు ఉచిత వాయిస్ కాల్స్ ప్ర‌యోజ‌నాలు పొంద‌లేక‌పోతున్నారు, ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను వినియోగించుకోలేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో జియో మ‌రో భారీ అడుగు వేస్తూ భార‌తీయులంద‌రినీ డిజిట‌ల్ విప్ల‌వంలో భాగం చేసుకునేందుకు ముందుకు సాగుతోంది. ప్ర‌త్యేక‌మైన మ‌రియు ఒకేసారి మాత్ర‌మే ల‌భ్య‌మ‌య్యే ఆఫర్‌ను `జియో ఫోన్ దీపావ‌ళి 2019 ఆఫ‌ర్‌` పేరుతో జియో నేడు ప్ర‌క‌టించింది.
ద‌స‌రా మ‌రియు దీపావ‌ళి పండుగ స‌మ‌యంలో, జియో ఫోన్ ప్ర‌స్తుత ధ‌ర రూ.1500 కాకుండా ప్ర‌త్యేక ధ‌ర కింద‌ కేవ‌లం రూ. 699కే జియో ఫోన్ అందుబాటులో ఉంచుతోంది. అంటే రూ.800 ఒకేసారి పొదుపు చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తోంది. పాత ఫోన్ ఎక్సేంజ్ చేసుకోవ‌డం వంటి ప్ర‌త్యేకమైన ష‌ర‌తులు ఏవీ కూడా విధించ‌క‌పోవ‌డం దీనియొక్క మ‌రో ప్ర‌త్యేక‌త‌.
ప్ర‌స్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న 2జీ ఫీచ‌ర్ ఫోన్ల కంటే కూడా ఈ ధ‌ర ఎంతో త‌క్కువ కావ‌డం విశేషం. త‌ద్వారా, ఫీచ‌ర్ ఫోన్ వినియోగ‌దారులు శ‌క్తివంత‌మైన 4జీ సేవ‌ల‌ను పొందేందుకు ఉన్న చివ‌రి అడ్డంకి సైతం ఈ రూపంలో దూరం చేయ‌డం సాధ్య‌మైంది.
రూ.700కు సంబంధించి, జియో ఫోన్ వినియోగ‌దారులు ఆ మొత్తంతో జియో ఫోన్ కొనుగోలు చేసి 2జీ నుంచి 4జీ డాటా ప్ర‌పంచంలోకి మారిపోవ‌చ్చు. ఇదే స‌మ‌యంలో, జియో సైతం త‌న‌వంతు పెట్టుబ‌డిని పెడుతున్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. త‌ద్వారా, భార‌త‌దేశంలోని అర్హ‌త క‌లిగిన వ‌ర్గాల‌న్నింటినీ ఇంట‌ర్నెట్ ఎకాన‌మీలో భాగస్వామ్యం అయ్యేందుకు జియో పెట్టుబ‌డి పెట్టడంతో పాటుగా అంకిత‌భావంతో కృషి చేస్తోంది.
జియో ఫోన్ వినియోగ‌దారుల విష‌యానికి వ‌స్తే, దీపావ‌ళి 2019 ఆఫ‌ర్ వినియోగించుకోవాల‌ని భావిస్తే, రూ.700 విలువైన డాటా ప్ర‌యోజ‌నాల‌ను జియో వారికి అందిస్తోంది. ఆ వినియోగ‌దారుడు చేసుకున్న మొద‌టి ఏడు రీచార్జ్‌ల‌కు రూ.99 విలువైన డాటాను జియో అధ‌నంగా జ‌త‌చేయ‌నుంది.
జియోఫోన్ వినియోగ‌దారుల‌కు అధ‌నంగా అందే ఈ రూ.700 డాటాతో జియో వినియోగ‌దారులు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, పేమెంట్స్‌, ఈకామ‌ర్స్‌, విద్య, శిక్ష‌ణ‌, రైల్లు మ‌రియు బ‌స్ బుకింగ్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ యాప్‌లు మ‌రియు మ‌రెన్నో అంశాల‌కు సంబంధించిన మునుపెన్న‌డూ లేని అనుభూతుల‌ను సొంతం చేసుకోవ‌చ్చు.
జియో ఫోన్‌పై పొదుపు చేసుకునే రూ.800 మ‌రియు రూ.700 విలువైన డాటా, మొత్తం క‌లిపి రూ.1500 భారీ ప్ర‌యోజ‌నం ప్ర‌తి జియో ఫోన్ వినియోగ‌దారుడికి సొంతం అవుతుంది. ఈ రూ. 1500 లాభం డిజిట‌ల్ ఇండియా క‌ల సాకారం చేసుకోవ‌డంలో భాగంగా జియో అందిస్తున్న దీపావ‌ళి కానుక‌. ఈ పండుగ మాసంలో జియో ద్వారా అందించే ఒక్కసారి మాత్రమే ల‌భ్య‌మ‌య్యే ఈ ఆఫ‌ర్‌ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, భార‌త‌దేశంలో 2జీ సేవ‌లను వినియోగిస్తున్న వారు దాని నుంచి అప్‌గ్రేడ్ అయి జియో ఫోన్ ప్లాట్‌ఫాంకు చేరువ కావాల‌ని జియో ఆహ్వానిస్తోంది.
శ్రీ ముఖేష్ అంబానీ, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ చైర్మ‌న్ మ‌రియు మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా త‌న అభిప్రాయాలు పంచుకుంటూ, ``అందుబాటు ధ‌ర‌లో చేరువ‌గా ఉన్న‌ ఇంట‌ర్నెట్ పొందేందుకు భార‌తదేశంలోని ఏ ఒక్క‌రికి డ‌బ్బు స‌మ‌స్య‌గా మార‌కూడ‌దని మ‌రియు డిజిట‌ల్ విప్ల‌వం యొక్క ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోకుండా ఉండాల‌ని జియో కృషి చేస్తుంది``అని స్ప‌ష్టం చేశారు. ``జియో ఫోన్ దీపావ‌ళి కానుక అందించ‌డం ద్వారా మేం ప్ర‌తి ఒక్క వినియోగ‌దారుడిపై రూ.1500ను పెట్టుబ‌డిగా పెట్టి ఆ కొత్త వ్య‌క్తి ఇంట‌ర్నెట్ ఎకాన‌మీలోకి ఆర్థిక కార‌ణాల వ‌ల్ల చేరుకోలేక‌పోయిన స్థితిని దూరం చేస్తున్నాం. మ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ గారి యొక్క డిజిట‌ల్ ఇండియా మిష‌న్ క‌ల‌ను నెర‌వేర్చేందుకు మేం అందిస్తున్న మ‌ద్ద‌తుగా కూడా భావించ‌వ‌చ్చు`` అని వెల్ల‌డించారు.