పెదకూరపాడు నియోజకవర్గం గారపాడు గ్రామంలో నిర్వహించిన పార్టీలో చేరికల కార్యక్రమంలో నరసరావుపేట పార్లిమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయ లు గారు పాల్గొన్నారు. గ్రామంలో 200 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. పార్టీ లో చేరిన వారికి ఎంపీ కృష్ణదేవరాయలు గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న అభివృద్ధిని చూసి నమ్మకంతో జోరుగా పార్టీలో చేరు తున్నారు. ఎక్కడా అవినీతికి, రికమండేషన్ లకు తావివ్వకుండా ప్రతిభ ఆధారంగా గ్రామ సచివాలయ పరీక్ష నిర్వహణ జరిగింది. గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇక నుంచి ప్రజలకు అన్ని విభాగాల్లో మెరుగైన సేవలు అందిస్తారు. ప్రజలు కూడా వారికి సహకరించి సమన్వయంతో సమస్యలు పరిష్కరించుకోవాలి అని ఎంపీ కృష్ణదేవరాయ లు గారు సభలో ప్రసంగించారు. అందరికీ సభ వేదికగా గాంధీ జయంతి శుభాకాంషలు తెలిపారు.
200 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి