మనతో పాటు ఉన్నవారిని కాపాడుకోవాలి.

మనతో పాటు ఉన్నవారిని కాపాడుకోవాలి.


పరిటాల రవి గారు చనిపోయిన మీరు మారలేదు, కోడెల శివప్రసాద్ గారు చనిపోయిన మీరు మారలేదు, హరికృష్ణ గారు చనిపోయ్యే వరకు ఆయన విలువ తెలవలేదు, ఎవ్వరి స్వార్థం కోసం వారు ఎదుటి వారిని పొడుచుకొని తింటమే. ఎవ్వరికి వారు గొప్ప అనిపించుకోవడం కోసం మన తోటి వారిని విమర్శించడమా రాజకీయం అంటే. కొత్తగా మనకి వచ్చి ఎవ్వరో ఏదో చేస్తారని చూడటం కాదు, ముందల మనతో పాటు ఉన్నవారిని కాపాడుకోవాలి.


అంతెందుకు ఈ రోజు అధికార పార్టీ MLA లుగా ఉన్నవారు కూడా నిన్నటి వరకు డ్రైవర్ లేకుండా తమ కారుని తామే సొంతంగా డ్రైవ్ చేసుకున్నారు. నిన్నటి వరకు మన పార్టీ నాయకుల కార్లలో ఖాళీ లేకుండా జనం ఎక్కారు, కాని ఈ రోజు మన నాయకులు కూడా డ్రైవర్లు లేకుండా సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ ఒక్కరే వెళ్తుంటే అది కనిపించదు మనకి.


ఇంక ఎప్పుడు మారతారు, ఎప్పుడు బాగుపడతారు. ఒక్కరిని ఒక్కరు పొడుచుకొని తినడమే రాజకీయమా, అందరిని కలుపుకొని కలిసి పనిచేస్తే రాజకీయం కాదా


మారండి అయ్యా, మన నాయకులు హత్యా రాజకీయాలలో చనిపోతున్న, మన నాయకులు అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న, మన నాయకులు మీద కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్న, మన నాయకులు బాధలు భరించలేక రాజీనామాలు చేస్తున్న, ఇంకా దేనికోసం మీ పాకులాట. మనం బాగుపడాలన్న, మన పార్టీ బాగుపడాలన్న, ఇప్పటికి అయినా అందరూ కలిసి పనిచేయండి అయ్యా, లేక పోతే మనతో పాటు మన పార్టీ కూడా ఉండదు.